logo

header-ad
header-ad

జూన్‌లో పెరిగిన ఉద్యోగావకాశాలు : తాజా నివేదిక

ముంబై : అష్ట దిగ్బంధనం ఆంక్షలు నెమ్మదిగా తగ్గడంతో జూన్‌లో ఉద్యోగావకాశాలు పెరిగాయి. దేశవ్యాప్తంగా చాలా రంగాల్లో ఉపాధి కల్పనలో సకారాత్మక వృద్ధి కనిపించింది. నాన్-టెక్ రంగాలు సైతం కోలుకుంటున్నాయి. ముఖ్యంగా ఐటీ రంగం వేగంగా వృద్ధి చెందుతోంది. SCIKEY మార్కెట్ నెట్‌వర్క్ నివేదిక ఈ వివరాలను శనివారం వెల్లడించింది. 

చాలా రంగాలకు సంబంధించిన సమాచారాన్ని పరిశీలించినపుడు ఉపాధి కల్పనలో మెరుగుదల కనిపించిందని ఈ అధ్యయన నివేదిక పేర్కొంది. మే నెలతో పోల్చినపుడు జూన్ నెలలో బ్యాంకింగ్ రంగంలో ఉపాధి కల్పన 21 శాతం మెరుగుపడింది. ఐటీ, బీపీఓ వంటి పరిశ్రమలు 18 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఫార్మాస్యూటికల్ రంగంలో 16.9 శాతం వృద్ధి కనిపించింది. హెల్త్‌కేర్ సెక్టర్‌లో హైరింగ్ డిమాండ్ 20 శాతం వృద్ధి చెందింది. ఉద్యోగార్థులకు ఈ పరిణామాలు ఆశాజనకంగా మారాయి. 

ఉద్యోగాలు ఇవ్వడంలో బీమా రంగం 12 శాతం, రీటెయిల్ రంగం 5 శాతం, విద్యా రంగం 12.1 శాతం, ఎఫ్ఎంసీజీ 16 శాతం వృద్ధి చూపించాయి. అయితే టెలికాం రంగంలో హైరింగ్  మే నెల కన్నా జూన్ నెలలో 8 శాతం తగ్గింది.

Source: https://andhrajyothy.com/telugunews/latest-report-reveals-hiring-improved-in-june-1921071708433538

Leave Your Comment