కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లక్ష్మి కళ్యాణం సినిమాతో కాజల్ అగర్వాల్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత టాప్ హీరోలందరితో సినిమాలు చేసింది. గత 12 సంవత్సరాలుగా కాజల్ సినిమా ఇండస్ట్రీలో ఉన్నది. ఇప్పటికే ఈ అమ్మడి వయసు 35 వరకు వచ్చింది. కాజల్ వయసులో ఉన్న హీరోయిన్లు పెళ్లి చేసుకొని సెటిల్ అవుతుంటే కాజల్ మాత్రం ఇంకా సినిమా ఇండస్ట్రీలో ఉంటూ పెళ్లి చేసుకోలేదు.
కాగా, త్వరలోనే కాజల్ వివాహం చేసుకోబోతున్నట్టు ప్రకటించింది. తాను ఓ సాధారణ యువకుడిని ప్రేమించానని, కానీ, షూటింగ్ బిజీ కారణంగా పెళ్లి చేసుకోలేదని చెప్పింది. ప్రస్తుతం కాజల్ తల్లిదండ్రులు ఆమెకోసం ఓ బుసినెస్ మెన్ ను చూసినట్టుగా వార్తలు వస్తున్నాయి. త్వరలోనే కాజల్ పెళ్లిపీటలు ఎక్కబోతున్నది. అయితే, వరుడు ఎవరు ఏంటి అన్నది కూడా త్వరలోనే బయటకు వస్తుంది. ప్రస్తుతం కాజల్ భారతీయుడు 2, ముంబై సాగా సినిమాలు చేస్తోంది.