ప్రముఖ జ్యూయలరీ సంస్థ జోయ్ అలుక్కాస్ ‘డబుల్ ద జాయ్’ పేరుతో సరికొత్త ఆఫర్ ను ప్రకటించింది. బంగారం కొనుగోలు చేసిన వారికి అదే బరువు ఉండే వెండిని ఉచితంగా ఇస్తోంది. పండుగల సీజన్‌లో తమ కస్టమర్లు విశేష స్పందన చూసిన నేపథ్యంలో ఆఫర్లను పొడిగించడంలో భాగంగా బంగారాన్ని కొంటే వెండిని ఫ్రీగా ఇస్తున్నట్లు సంస్థ ఎండీ జోయ్ అలుక్కాస్ అన్నారు. పాత బంగారాన్ని సున్నా శాతం తగ్గింపుతో మార్చుకోవచ్చని, ఏడాది ఉచిత బీమా అందిస్తున్నామని వివరించారు.

Source: https://www.sakshi.com/news/business/joyalukkas-double-joy-offer-festival-season-1238203