logo

header-ad
header-ad

అలర్ట్... ఈ 34 యాప్స్‌లో జోకర్ మాల్‌వేర్..

Joker malware Android Apps | మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా? ప్లేస్టోర్ నుంచి యాప్స్ డౌన్‌లోడ్ చేస్తున్నారా? అయితే వెంటనే ఈ 34 యాప్స్ డిలిట్ చేయండి.

ఆండ్రాయిడ్ యాప్స్‌ని జోకర్ మాల్‌వేర్ ముప్పుతిప్పలు పెడుతోంది. జోకర్ మాల్‌వేర్ ఉన్న యాప్స్‌ని ప్లేస్టోర్ నుంచి గూగుల్ తొలగిస్తున్నకొద్దీ మరిన్ని యాప్స్‌లో ఈ మాల్‌వేర్ బయటపడుతోంది. ఇప్పటికే జోకర్ మాల్‌వేర్ ఉందన్న కారణంతో అనేక యాప్స్‌ని ప్లేస్టోర్ నుంచి తొలగించింది గూగుల్. ఇప్పుడు మరో 34 యాప్స్‌లో ఈ మాల్‌వేర్ బయటపడటం ఆండ్రాయిడ్ యూజర్లను కలవరపరుస్తోంది. దీంతో జోకర్ మాల్‌వేర్ ఉన్న యాప్స్ వంద వరకు ఉన్నట్టు ఇప్పటికే గుర్తించారు. ఇంకా ఎన్ని యాప్స్‌లో ఈ మాల్‌వేర్ ఉందో తెలియదు. ఈ యాప్స్ ఏవైనా ఉపయోగిస్తున్నట్టైతే యూజర్లు వెంటనే వాటిని డిలిట్ చేయడం అవసరం.

గూగుల్ లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన 34 యాప్స్ జాబితా ఇదే..

All Good PDF Scanner

Mint Leaf Message-Your Private Message

Unique Keyboard – Fancy Fonts & Free Emoticons

Tangram App LockDirect Messenger

Private SMS

One Sentence Translator – Multifunctional Translator

Style Photo Collage

Meticulous Scanner

Desire Translate

Talent Photo Editor – Blur focus

Care Message

Part Message

Paper Doc Scanner

Blue Scanner

Hummingbird PDF Converter – Photo to PDF

All Good PDF Scanner

com.imagecompress.android

com.relax.relaxation.androidsms

com.file.recovefiles

com.training.memorygame

Push Message- Texting & SMS

Fingertip GameBox

com.contact.withme.texts

com.cheery.message.sendsms (ఇదే పేరుతో రెండు యాప్స్ ఉన్నాయి)

com.LPlocker.lockapps

Safety AppLock

Emoji Wallpaper

com.hmvoice.friendsms

com.peason.lovinglovemessage

com.remindme.alram

Convenient Scanner 2

Separate Doc Scanner

ఈ 34 యాప్స్‌లో హానికరమైన జోకర్ మాల్‌వేర్ ఉంది. వీటిని ప్లేస్టోర్ నుంచి గూగుల్ డిలిట్ చేసింది. అయితే వీటిని ఇప్పటికే డౌన్‌లౌడ్ చేసినవారు ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ యాప్స్ ఉపయోగిస్తే ముప్పు తప్పదు. అందుకే వెంటనే వాటిని డిలిట్ చేయాలి. మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్ ఉపయోగిస్తున్నట్టైతే అన్-ఇన్‌స్టాల్ చేయండి. ఈ యాప్‌కు సంబంధించిన ఇతర ఫైల్స్ ఎవైనా ఉంటే డిలిట్ చేయండి. ఆండ్రాయిడ్ యాప్స్‌లో జోకర్ మాల్‌వేర్ కొత్తేమీ కాదు. అయితే ఇటీవల కాలంలో ఎక్కువగా యాప్స్‌లో ఈ మాల్‌వేర్ బయటపడుతూ ఉంది. యూజర్ల క్లిక్స్‌ని నియంత్రించడం, ఎస్ఎంఎస్‌లను ట్రాక్ చేస్తూ ఉండటం, యూజర్ల ప్రమేయం లేకుండా అవసరం లేని పెయిడ్ ప్రీమియం సర్వీసుల్ని సబ్‌స్క్రైబ్ చేస్తూ ఉండటం జోకర్ మాల్‌వేర్ చేసే పని.

Source: https://telugu.news18.com/news/technology/joker-malware-infected-34-android-apps-google-removed-all-applications-from-playstore-delete-immediately-these-apps-ss-622862.html

Leave Your Comment