ఐసిస్ చీఫ్ బాగ్దాదీని అమెరికా సైనికులు సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించి మట్టుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఐసిస్ కూడా ధృవీకరించింది. ఐసిస్ చీఫ్ చనిపోయినట్టుగా పేర్కొంది. ఐసిస్ చీఫ్ లేకపోవడంతో ఆ సంస్థ బలహీనపడిందని, అందరూ అనుకున్నారు. కానీ, అమెరికా దాడిలో ఐసిస్ చీఫ్ మరణించిన కొన్ని రోజులకే మాలిలో ఐసిస్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు.
మాలిలో ఆర్మీపోస్టులను లక్ష్యంగా చేసుకొని తెగబడ్డారు. ఐసిస్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 53 మంది ఆర్మీ జవానులు మరణించారు. ఈ దాడి చేసింది తామే అని ఐసిస్ ప్రకటించడంతో అమెరికా షాక్ అయ్యింది. బలహీనపడుతుంది అనుకున్న ఐసిస్, ఇలా షాక్ ఇవ్వడంతో అమెరికాతో సహా ఆ ఉగ్రవాద సంస్థతో పోరాటం చేస్తున్న దేశాలు షాక్ అయ్యాయి.