logo

header-ad
header-ad

ఐ ఫోన్ 12.. త‌యారీ ధ‌ర ఎంతో తెలుసా?

ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్పుడు విస్తృత‌మైన మార్కెట్ ఉన్న‌వి ఎల‌క్ట్రిక్ గ్యాడ్జెట్ లు. ప్ర‌తి సంవ‌త్స‌రం వీటి వ్యాపారం ప్ర‌పంచ వ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో జ‌రుగుతూ ఉంటుంది. ఇక స్మార్ట్ ఫోన్ మేకింగ్ లో కొన్ని సంస్థ‌లు విప‌రీత‌మైన క్రేజ్ ను సంపాదించుకున్న సంగ‌తిని కొత్త‌గా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

గ‌త ద‌శాబ్ద‌కాలంలో వాటి మార్కెటింగ్ విస్తృతి ఒక రేంజ్ కు చేరిపోయింది. స్మార్ట్ ఫోన్ మేకింగ్ సంస్థ‌ల‌ను సామాన్య ప్ర‌జ‌లు కూడా ఎంత‌గానో ఆరాధించే ప‌రిస్థితి! ఇలాంటి గొప్ప క్రేజ్ ను క‌లిగి ఉన్న వాటిల్లో ఐ ఫోన్ ప్ర‌స్థానం గురించి చెప్ప‌న‌క్క‌ర్లేదు.

గ‌త ద‌శాబ్ద కాలంలో ఐ ఫోన్ ఎ‌క్క‌డా త‌న ప‌ట్టును కోల్పోకుండా క్రేజీ డీల్స్ ను కొన‌సాగిస్తూ ఉంది. ఈ క్ర‌మంలో ఐ ఫోన్-12 కు సంబంధించిన ఆస‌క్తిదాయ‌క‌మైన స‌మాచారం ఇది.

ప్ర‌స్తుతం మార్కెట్ లో ఐఫోన్ -12 ధ‌ర 84,900 రూపాయ‌లు కాగా, దాని మేకింగ్ ధ‌ర మాత్రం అందులో స‌గం కూడా లేదు. భార‌త ద్ర‌వ్య‌మానంలో ఐఫోన్-12 మేకింగ్ ధ‌ర 31,700 రూపాయ‌లు అని స‌మాచారం. ఎల్సీడీ నుంచి ఓఎల్ఈడీ డిస్ ప్లేకు షిఫ్ట్ కావ‌డంతో.. మేకింగ్ చార్జ్ కాస్త పెరిగింద‌ట‌. 5జీ రిలేటెడ్ కాంపోనెంట్స్ తో రూపొందే ఈ ఫోన్ మేకింగ్ చార్జ్ దాదాపు 32 వేల రూపాయ‌ల‌కు చేరింద‌ట‌.

స్మార్ట్ ఫోన్ డివైజ్ ల మేకింగ్ ధ‌ర సంగ‌తెలా ఉన్నా.. వాటి ప్ర‌మోష‌న్ కోసం ఆయా సంస్థ‌లు అత్యంత భారీగా ఖ‌ర్చు చేస్తూ ఉంటాయి. వంద‌ల‌, వేల కోట్ల రూపాయ‌ల మొత్తాల‌ను ఇండియాలోనే ప‌బ్లిసిటీ, ప్ర‌మోష‌న్ కోసం ఖ‌ర్చు చేస్తూ ఉంటాయి.

మిగ‌తా వాటితో పోలిస్తే యాపిల్ ఇచ్చే యాడ్స్, ప్ర‌మోష‌నల్ యాక్టివిటీస్ త‌క్కువే. బ్రాండ్ వ్యాల్యూ,  బ్రాండ్ క్రేజ్ ఉండ‌టంతో.. ఐఫోన్ మేక‌ర్లు ప్ర‌మోష‌న్ కోసం పెట్టే ఖ‌ర్చు కొంచెం త‌క్కువే. సొంతంగా స్టోర్స్ ద్వారానే ఎక్కువ అమ్మ‌కాలు కూడా జ‌రుగుతుంటాయి. అయినా మేకింగ్ ధ‌ర‌తో పోలిస్తే రెట్టింపు మొత్తానికి అమ్ముతున్న‌ట్టున్నారు.

Source: https://telugu.greatandhra.com/special-news/science/iphone-12-making-charge-and-sales-charge--114516.html

Leave Your Comment