logo

header-ad
header-ad

గ్యాస్‌ వినియోగదారులకు గుడ్‌ న్యూస్‌..! ఇకపై

న్యూ ఢిల్లీ: గ్యాస్‌ వినియోగదారులకు శుభవార్త..! ఇకపై గ్యాస్‌ ఎప్పుడు ఖాళీ అవుతుందనే విషయాన్ని తెలుసుకోవడం మరింత సులువుకానుంది. అంతేకాకుండా గ్యాస్‌ సిలిండర్ల బరువు కూడా భారీగా తగ్గనుంది. తాజాగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) కొత్తగా స్మార్ట్‌ ఎల్‌పీజీ సిలిండర్లను విడుదల చేసింది.  వీటిని ఇండానే కాంపోజిట్ సిలిండర్లుగా పిలువనున్నారు. ఈ కొత్త స్మార్ట్ సిలిండర్లతో కస్టమర్లు తమ తదుపరి రీఫిల్‌ను ఎప్పుడు బుక్‌ చేయాలనే విషయాన్ని సులభంగా తెలుసుకోవచ్చును.

ప్రస్తుతం ఐఓసీఎల్‌ విడుదల చేసిన  స్మార్ట్‌ సిలిండర్లతో గ్యాస్‌  ఎంత పరిమాణం ఉందనే విషయాన్ని తెలుసుకోవచ్చును. సాధారణంగా గ్యాస్‌ సిలిండర్లు స్టీల్‌తో చేస్తారు. కాగా  ఐఓసీఎల్‌ రిలీజ్‌ చేసిన స్మార్ట్‌ సిలిండర్లను హై-డెన్సిటీ పాలిథిలిన్(హెచ్‌డీపీఈ)తో తయారుచేశారు. ఈ సిలిండర్లు మూడు లేయర్ల నిర్మాణాన్ని కల్గి ఉంది.ఈ నిర్మాణంతో స్టీల్‌ సిలిండర్లు మాదిరి స్మార్ట్‌ సిలిండర్లు ధృడంగా ఉంటాయని తెలుస్తోంది.  అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న సిలిండర్లలో సగానికిపైగా బరువు తగ్గనుంది. ఇంట్లో స్టీల్‌ సిలిండర్లతో ఎదురయ్యే తుప్పు సమస్యలకు ఇక కాలం చెల్లనుంది. 

ఈ స్మార్ట్ సిలిండర్లను  న్యూ ఢిల్లీ, గుర్గావ్, హైదరాబాద్, ఫరీదాబాద్, లూధియానాలోని 5 కిలోలు, 10 కిలోల పరిమాణాలలో ఎంపిక చేసిన పంపిణీదారులకు అందుబాటులో ఉండనున్నాయి. స్మార్ట్‌ సిలిండర్లు త్వరలో దేశవ్యాప్తంగా లభిస్తాయని ఐఓసిఎల్ ఒక ప్రకటనలో పేర్కొంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మీరు ప్రస్తుతం ఉన్న  వాడుతున్న ఎల్‌పీజీ స్టీల్ సిలిండర్ల స్థానంలో స్మార్ట్‌ సిలిండర్లతో భర్తీ చేయవచ్చును. కాగా ప్రస్తుతం ఐఓసీఎల్ తీసుకున్న చర్యతో భవిష్యత్తులో అన్ని గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీలు హెచ్‌డీపీఈ సిలిండర్లను ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Source: https://www.sakshi.com/telugu-news/business/iocl-has-rolled-out-new-brand-liquefied-petroleum-gases-lpg-cylinders-1379586

Leave Your Comment