logo

header-ad
header-ad

ఈ చిన్న పని చేస్తే.. రైల్వే స్టేషన్‌లో టికెట్ ఫ్రీ!

ఇక నుంచి రైల్వేస్టేషన్‌లో ఈ చిన్న పని చేస్తే.. టికెట్‌ ఫ్రీగా తీసుకోవచ్చు.! ఏంటా మంచి ఆఫర్ అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా.. ఈ విషయాన్ని సంబంధించి కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ చేసిన ట్వీట్..

ఇక నుంచి రైల్వేస్టేషన్‌లో ఈ చిన్న పని చేస్తే.. టికెట్‌ ఫ్రీగా తీసుకోవచ్చు.! ఏంటా మంచి ఆఫర్ అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా.. ఈ విషయానికి  సంబంధించి కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ చేసిన ట్వీట్ ఇప్పుడు ఫుల్లు వైరల్ అవుతోంది. అసలు ఇంతకీ ఆ ట్వీట్‌ మొక్క ఉద్దేశ్యం ఏంటంటే.. ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌లో కొత్తగా ఫిట్‌నెస్ మిషన్‌ను ఏర్పాటు చేశారు.

ఈ మిషన్ ముందు కాసేపు సిటప్స్ (గుంజీలు) 30 తీస్తే ఉచితంగా ఫ్లాట్‌ ఫాం టికెట్ వస్తుంది. ఇంకేముంది.. ‘ఆరోగ్యానికి ఆరోగ్యం.. డబ్బుకి డబ్బు సేవ్’ అవుతున్నాయన్నమాట. భలేగా ఉంది కదా ఆఫర్. పొదుపును ప్రోత్సహించేందుకు ఇలా వినూత్న ప్రయోగాన్ని తీసుకొచ్చామని గోయెల్ పేర్కొన్నారు. ఇప్పటికే రష్యా లాంటి అభివృద్ధి చెందిన దేశాలు ఇలాంటి పద్దతులనే అవలంభిస్తున్నాయని, త్వరలోనే భారతదేశ వ్యాప్తంగా కూడా వీటిని తీసుకురానున్నట్లు ఆయన పేర్కొన్నారు.

 

Source: https://tv9telugu.com/indian-railways-introduces-machines-that-give-free-platform-tickets-203803.html

Leave Your Comment