logo

header-ad
header-ad

తమన్‌ సంగీతంలో... 135మంది కళాకారులతో!

రామ్‌చరణ్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు, శిరీష్‌ ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ఎస్‌.ఎస్‌. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో ఓ పాటను రికార్డ్‌ చేశారు. ‘‘ఈ నెల 14, 15 తేదీల్లో రామ్‌చరణ్‌ పరిచయ గీతం పనులు ప్రారంభించాం. వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 135మంది కళాకారులు రికార్డింగ్‌లో పాల్గొన్నారు. వారితో రామ్‌చరణ్‌ జాయిన్‌ కావడం విశేషం. ఆయన పాట విని చాలా ఎగ్జైయిట్‌ అయ్యారు’’ అని ‘దిల్‌’ రాజు, శిరీష్‌ తెలిపారు. శంకర్‌ నిర్మించిన ‘వైశాలి’ (తమిళంలో ‘ఈరం’)తో సంగీత దర్శకుడిగా తమన్‌ ప్రయాణం మొదలైంది. ఇప్పుడు ఆయన మాట్లాడుతూ ‘‘నేను ‘వైశాలి’ కోసం ఓ ట్యూన్‌ ఇచ్చినప్పుడు... శంకర్‌గారు విన్న వెంటనే ఓకే చేశారు. ఇన్నేళ్ల తర్వాత గొప్ప దర్శకుడితో కలిసి పని చేయడం చాలా ప్రత్యేకంగా ఉంది’’ అని చెప్పారు. శంకర్‌ దర్శకత్వం వహించిన ‘బాయ్స్‌’లో తమన్‌ నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో 50వ చిత్రమిది. దీనికి హర్షిత్‌రెడ్డి సహనిర్మాత.

Source: https://chitrajyothy.com/telugunews/in-taman-music-with-135-artists-1921072003162550

Leave Your Comment