Beth Mooney Commnets On Punam Raut dismissal: ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న పింక్‌బాల్ టెస్ట్‌లో భారత మహిళా జట్టు బ్యాటర్ పూనమ్ రౌత్ ప్రదర్శించిన క్రీడా స్పూర్తి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నది. అయితే రెండో రోజు భారత్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో ఆసీస్ బౌలర్ మోలిన్యూక్స్ వేసిన బంతిని పూనమ్ ఆడేందుకు ప్రయత్నించగా బంతి బ్యాట్‌ను తాకి నేరుగా కీపర్ హీలీ చేతిలోకి వెళ్లింది. కీపర్‌తో పాటు ,ఆసీస్ క్రికెటర్లు అందరూ అవుట్ అని అప్పీల్ చేయగా.. అంపైర్ మాత్రం నాటౌట్‌గా ప్రకటించాడు. అంపైర్ నాటట్‌గా ప్రకటించినా తాను ఔటయినట్టు నిర్ధారించుకున్న రౌత్ పెవిలియన్ బాట పట్టింది. ఈ సిరీస్‌లో డీఆర్‌ఎస్ కూడా అందుబాటులో లేదు. అయినప్పటకీ మైదానాన్ని వదిలి వెళ్లి ఆసీస్ క్రికెటర్లను సైతం పూనమ్ ఆశ్చర్యపరిచింది.
ఈ క్రమంలో ఆసీస్ ఓపెనర్ బెత్ మూనీ మాట్లాడుతూ.. ఒక వేళ ఆమె స్ధానంలో నేను ఉంటే అస్సలు గ్రౌండ్‌ని వదిలి వేళ్లేదాన్ని కాదని తెలిపింది. ఈ సంభాషణ అంతా స్టంప్ మైక్రోఫోన్ లో రికార్డయింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. .భారత్ ఆడుతున్న తొలి డే నైట్ టెస్టులో సెంచరీ సాధించి స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. మంధాన 216 బంతుల్లో 22 ఫోర్లు, 1 సిక్స్‌తో 127 పరుగులు సాధించింది. వర్షంతో ఆట ముగిసే సమయానికి భారత మహిళల జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 101.5 ఓవర్లలో 5 వికెట్లకు 276 పరుగులు చేసింది.