logo

header-ad
header-ad

డిసెంబర్ నాటికి హువావే నూతన ఆపరేటింగ్ సిస్టం...?

ఢిల్లీ : గూగుల్ ఆండ్రాయిడ్‌ను ఉపయోగించకుండా చైనా టెలికం దిగ్గజం హువావేను అమెరికా నిషేధించిన అనంతరం ప్రత్యామ్నాయ యాప్ ఎకోసిస్టం నిర్మాణంపై ఈ చైనీస్ దిగ్గజం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఆండ్రాయిడ్‌కు సమాధానంగా హార్మోనీఓఎస్‌ను ప్రకటించి దాదాపు ఏడాది కావొస్తున్నది. చైనాలో దీనిని "హాంగ్‌మెంగ్ఓఎస్‌"గా పిలుస్తారు. హువావే, హానర్ ఫోన్‌లలో ఆండ్రాయిడ్ స్థానంలో దీనిని అభివృద్ధి చేస్తున్నారు. ఈ ఓఎస్ అధికారిక విడుదల త్వరలో జరగనుంది. స్మార్ట్ ఫోన్లలో వచ్చే ఏడాది నుంచి తమ నూతన స్వదేశీ ఆపరేటింగ్ సిస్టం అందుబాటులోకి వస్తుందని హువావే తాజాగా వెల్లడించింది.

స్మార్ట్ ఫోన్ల కోసం యాప్స్ తయారు చేస్తున్న డెవలరప్లకు డిసెంబర్ నుంచి హార్మోనీ ఓఎస్ సోర్స్ కోడ్ అందుబాటులోకి వస్తుందని హువావే కన్స్యూమర్ ప్రోడక్ట్స్ డివిజన్ సీఈవో యు చెంగ్‌డాంగ్ తెలిపారు. హార్మోనీ ఓఎస్‌ను ఇప్పటి వరకు స్మార్ట్ టీవీలు, ఈన్-కార్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్స్, వేరబుల్ డివైజ్‌లలో ఉపయోగిస్తున్నారు. కంపెనీ స్మార్ట్ ఫోన్లలో ఇప్పటి వరకు ఉపయోగించలేదు. శాంసంగ్ తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ ఉత్పత్తిదారు హువావే. కాగా, ఈ ఏడాది ఏప్రిల్ - జూన్ క్వార్టర్‌లో శాంసంగ్‌ను హువావే వెనక్కి నెట్టిందని ఈ రంగంలోని నిపుణులు భావిస్తున్నారు.

హోర్మోనీఓఎస్ రెండో వర్షన్ స్మార్ట్ ఫోన్లలతో పాటు విస్తృత శ్రేణి పరికరాలకు విడుదల చేయనున్నట్లు కంపెనీ సీఈవో రిచర్డ్-యూ అన్నారు. వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి రావొచ్చునని తెలిపింది. హార్మోనిఓఎస్ 2.0 ఎస్డీకే బీటా వర్షన్‌ను డిసెంబర్ 2020లో విడుదల చేయాలని హువావే యోచిస్తున్నది. హార్మోనీఓఎస్ ఆపరేటింగ్ ఫస్ట్ ఫోన్లు 2021లో లాంచ్ చేయనున్నారు. వివిధ కారణాలతో గూగుల్ నుంచి అన్ని సాఫ్టువేర్ల నిషేధాన్ని ఎదుర్కొంటోంది హువావే. గూగుల్ అన్ని సాఫ్టువేర్‌లకు ప్రత్యామ్నాయంగా హార్మోనిఓఎస్ భర్తీ చేయగలదని కంపెనీ సీఈవో వెల్లడించారు. ఇవి కేవలం స్మార్ట్ ఫోన్లకు మాత్రమే పరిమితం కాదని తెలిపారు. భవిష్యత్తులో హువావే ట్యాబ్స్, పీసీలకు కూడా ఈ సాఫ్టువేర్ అందుబాటులో ఉంటుందన్నారు. 

Source: https://www.ntnews.com/science-technology/huaweis-new-operating-system-by-december-78326

Leave Your Comment