logo

header-ad
header-ad

What’s App: సిగ్నల్ యాప్‏కు మారుతున్నారా ? అయితే మీ వాట్సప్ గ్రూపులను మార్చుకోండిలా..

వాట్సప్ ప్రైవసీ పాలసీ నిబంధన అమలు చేసినప్పటి నుంచి దానిపై విమర్శలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ఈ యాప్‏కు బదులుగా వేరే యాప్‏లను వెతికెపనిలో పడ్డారు. ఇక గత కొద్ది రోజులుగా ఇక వాట్సప్‏కు ధీటుగా వినిపిస్తున్న పేరు సిగ్నల్ యాప్. వాట్సప్‏ను అన్ ఇన్‏స్టాల్ చేసి తమ ఫోన్లలో సిగ్నల్ యాప్‏ను ఇన్‏స్టాల్ చేసుకుంటున్నారుు. ఇక వాట్సప్ ప్రైవసీ పాలసీని అగ్రీ చేయకపోతే ఫిబ్రవరి 8 నుంచి పనిచేయదు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అలర్ట్స్ యూజర్లందరికి నోటిఫికేషన్ల ద్వారా వస్తునే ఉన్నాయి.

ఇక వాట్సప్ తీసుకువచ్చిన ప్రైవసీ పాలసీ నిబంధన వలన వ్యక్తిగత గోప్యత వంటి అంశాలపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో అందరూ సిగ్నల్ యాప్‏కు మారిపోతున్నారు. కానీ వాట్సప్ గ్రూపులు, కాంటాక్టులను సిగ్నల్ యాప్‏కు లింక్ చేసుకోవడం ఎలా ? అలాగే అకౌంట్లోని గ్రూపులు, యూజర్ ప్రొఫైల్స్ ఎలా మైగ్రేట్ చేసుకోవాలి అనేది అందిరిలో కలిగే సందేహాలు. ఈ క్రమంలోనే వాట్సప్ గ్రూపులు, కాంటాక్టులను మార్చుకునేందుకు సిగ్నల్ యాప్ కొత్త ఆప్షన్ తీసుకువచ్చింది. ప్రతీసారి గ్రూపులో చేరిన ఒక్కో యూజర్‏ను యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా.. ఒకేసారి ఎక్కువ మంది వాట్సప్ గ్రూపు యూజర్లను సిగ్నల్ యాప్‏లోకి మర్చుకోవచ్చు.

☞ ముందుగా ప్లే స్టోర్ నుంచి సిగ్నల్ యాప్‏ను డౌన్‏లోడ్ చేసుకోవాలి.

☞ ఆ తర్వాత మీ ఫోన్ నంబర్ ద్వారా సిగ్నల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి.

☞ ఇందులో కొత్త గ్రూపు క్రియేట్ చేసి దానికి ఒక పేరు అసైన్ చేయాలి.

☞ ఇందులో గ్రూపుకు ఫోటో కూడా యాడ్ చేయొచ్చు.

☞ గ్రూపులోని ఏదైనా ఒక కాంటాక్ట్ నంబర్ మ్యానివుల్‏గా యాడ్ చేయండి.

☞ గ్రూపు సెట్టింగ్స్‏లోకి వెళ్ళి.. group link టర్న్ ఆన్ చేయాలి.

☞ Share ఆప్షన్ పై Tap చేసి.. వాట్సప్ గ్రూపులకు లింగ్ షేర్ చేయాలి.

☞ ఏ వాట్సప్ గ్రూపు ఇంపోర్ట్ చేయాలి అనుకుంటున్నారో ఆ గ్రూపుకు Invite link షేర్ చేయాలి.

☞ ఇతర ఏదైనా వాట్సప్ కాంటాక్ట్ కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు.

☞ ఇక వాట్సప్ గ్రూపులోని యూజర్లు ఈ లింక్ ద్వారా సిగ్నల్ గ్రూపులోకి యాడ్ కావొచ్చు.

Source: https://tv9telugu.com/how-to-shift-whatsapp-groups-to-the-new-app-388988.html

Leave Your Comment