logo

header-ad
header-ad

Horoscope Today: ఈ రాశివారికి ఈ రోజు శుభ ఫలితాలు.. దూర ప్రయాణాలు చేసే అవకాశం

Horoscope Today (October 13-10-2021): ఈరోజులో కొత్తపనిని మొదలు పెట్టాలన్నా , శుభకార్యాలు మొదలు పెట్టాలన్నా జాతకాలు, రాశిఫలాల ఆధారంగా చేసేవారు చాలామంది ఉన్నారు. జాతకాలను విశ్వసిస్తూ పనిని మొదలుపెట్టే ముందు కొంతమంది ఈరోజు తమ జాతకం ఎలా ఉంది అంటూ.. తమ దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (అక్టోబర్ 13న ) బుధవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో.. తెలుసుకుందాం..!

మేష రాశి: ఈ రోజు ఈ రాశివారు కెరీర్‌లో శుభ ఫలితాలను పొందవచ్చు. సాయంత్రం సమయంలో సహోద్యోగులతో వివాదాలు తలెత్తే అవకాశముంది. అంతేకాకుండా మీరు భావోద్వేగాలకు దూరంగా ఉండాలి. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండటం మంచిది.

వృషభ రాశి: ఈ రాశివారికి ఈ రోజు కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రోజు మీరు ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇదే సమయంలో కొన్ని రాశుల వారు తక్కువ దూరం ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి. అదృష్టం బాగా కలిసి వస్తుంది. వ్యాపారాన్ని విస్తరించుకుంటారు.

మిధున రాశి: ఈ రాశి వారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కొన్ని మానసిక సమస్యలు ఉండవచ్చు. ఈ రోజు ప్రాణాయామం చేయడం వల్ల అనుకూల ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా చివరకు అనుకున్నది సాధిస్తారు.

కర్కాటక రాశి: ఈ రాశివారు జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. వ్యాపారంలో నూతన ప్రణాళికలు ఊపందుకుంటాయి. అనుకున్న కార్యాలను నెరవేరుతాయి. ఆహారంపై దృష్టి పెట్టండి.కుటుంబం పట్ల మీ వైఖరి ఉదారంగా ఉంటుంది. యువకులను ప్రోత్సహించడంలో మీరు విజయం సాధిస్తారు.

సింహరాశి: ఈ రాశివారు ఈ రోజు అనేక సవాళ్లు ఎదురవుతాయి. ప్రత్యర్థులకు దూరంగా ఉండడటం మంచిది. 50 ఏళ్ల దాటిన వ్యక్తులు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మిమ్మల్ని మీరు ఫిట్ గా ఉంచుకోవడానికి సమతూల్య ఆహారం తీసుకోవాలి. లేకుంటే ఆరోగ్యం చెదిరిపోతుంది.

కన్యారాశి: ఈ రాశివారికి ఈ రోజు అనుకూల ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు శుభకరంగా ఉంటుంది. ఎవరినైనా ప్రేమిస్తే వారి ముందు ప్రేమను వ్యక్తపరచడానికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. నూతన అవకాశాలు సిద్ధిస్తాయి. మీ అభిప్రాయాలను బహిరంగంగా తెలియజేయాల్సిన సమయం వచ్చింది.

తులారాశి: తులా రాశి వారికి ఈ రోజు కొంత సవాలుగా అనిపిస్తుంది. సాయంత్రం 4 గంటల తర్వాత మీరు పరిస్థితుల్లో సానుకూల మార్పులను చూస్తారు. సాయంత్రం సమయంలో మీరు కుటుంబ సభ్యులతో కలిసి నడకకు వెళ్లే అవకాశముంది.

వృశ్చిక రాశి: ఈ రోజు ఈ రాశివారికి పనులు చేయడంలో ఎలాంటి సమస్య ఉండదు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా చివరకు అనుకున్నది సాధిస్తారు. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడుపుతారు.వ్యక్తిగత, వ్యాపార విషయాల్లో శక్తిమంతంగా ఉండటం ద్వారా ధైర్యంగా ఉంటారు.

ధనుస్సు రాశి: ఈ రాశివారికి కమ్యునికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. నటన, గానం మొదలైన రంగాలతో సంబంధం ఉన్న వ్యక్తులు మంచి ఫలితాలను పొందవచ్చు. దీంతో పాటు ఈ రాశి వారు ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశముంది. ప్రతికూల ఆలోచనలు తొలగించడానికి ప్రయత్నిస్తే మంచిది. మీరు మానసిక అసంతృప్తి చెందుతారు.

మకరరాశి: ఈ రాశివారికి ఆలోచనా విధానంలో సానుకూల మార్పులు వస్తాయి. ఫలితంగా కెరీర్, కుటుంబ జీవితంలో సంతోషకరమైన వార్తలను పొందుతారు. ఇనుముకు సంబంధించిన వ్యాపారం చేసేవారు లాభం పొందే అవకాశముంది. అనవసర విషయాల్లో తలదూర్చకపోతే మంచిది.పాత పద్ధతులను మెరుగుపరుస్తారు.

కుంభ రాశి: ఈ రాశివారికి ఈ రోజు అకస్మాత్తుగా ఖర్చులు పెరుగుతాయి. బడ్జెట్ ప్రకారం వెళ్తే ఎలాంటి సమస్య ఉండదు. ఫలితంగా విదేశీ వ్యాపారం చేసే వారికి శుభవార్తలు అందుతాయి. అంతేకాకుండా సానుకూల ఫలితాలు ఉంటాయి. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండటం మంచిది.

మీనరాశి: ఈ రాశికి చెందిన కొంతమంది వ్యక్తులు కెరీర్ పరంగా పదోన్నతులు పొందే అవకాశముంది. ఫలితంగా ఆదాయం పెరుగుతుంది. అనుకున్న కార్యాలు, వ్యవహారాలు సకాలంలో నెరవేరుతాయి.తల్లిదండ్రుల సహకారం ఉంటుంది. వ్యక్తిగత సంబంధాలు, కుటుంబ పరిస్థితుల విషయంలో గజిబిజిగా ఉండే వైఖరిని తీసుకోవద్దు.

Source: https://tv9telugu.com/astrology/horoscope-today-13-october-2021-check-astrological-prediction-for-aries-taurus-gemini-cancer-and-other-signs-557039.html

Leave Your Comment