logo

header-ad
header-ad

Horoscope Today: ఈ రాశివారికి సంతోషకరమైన వార్తలు.. ఇంటి ఖర్చులు అధికం..

Horoscope Today (October 07-10-2021): ఈరోజులో కొత్తపనిని మొదలు పెట్టాలన్నా , శుభకార్యాలు మొదలు పెట్టాలన్నా జాతకాలు, రాశిఫలాల ఆధారంగా చేసేవారు చాలామంది ఉన్నారు. జాతకాలను విశ్వసిస్తూ పనిని మొదలుపెట్టే ముందు కొంతమంది ఈరోజు తమ జాతకం ఎలా ఉంది అంటూ.. తమ దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (అక్టోబర్ 7న ) గురువారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో.. తెలుసుకుందాం..!

మేష రాశి: ఈ రోజు మేష రాశి వారికి ఇంటి ఖర్చులు పెరుగుతాయి. కార్యాలయంలో అనేక బాధ్యతలు అప్పగిస్తారు. అందరి అంచనాలకు అనుగుణంగా జీవించే సామర్థ్యం మీకు పేరు తీసుకొస్తుంది. కుటుంబ ఆస్తిని పొందడం వల్ల మీరు మీ జీవిత భాగస్వామి నుంచి గౌరవాన్ని అందుకుంటారు.

వృషభ రాశి: ఈ రోజు ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. రాజకీయ ప్రత్యర్థులు మిమ్మల్ని అధిగమించడానికి ప్రయత్నిస్తారు. నూతన పనులు ప్రారంభించడానికి సమయం అనుకూలంగా లేదు. భౌతిక విషయాలపై ఎక్కువ ఖర్చు చేయడం మానుకోండి. లేకుంటే ఆర్థిక పరిస్థితి క్షీణించవచ్చు. జీవిత భాగస్వామితో అవసరమైన సంభాషణలు ఉంటాయి.

మిధున రాశి: మిథున రాశి వారికి నేడు సాధారణంగా ఉంటుంది. పిల్లల వైపు నుంచి సంతోషకరమైన వార్తలు మీలో ధైర్యాన్ని పెంచుతాయి. కార్యాలయంలో కొంతమంది మిమ్మల్ని వ్యతిరేకించే అవకాశముంది. పని పూర్తయిన తర్వాత కూడా మీరు ప్రభావితమవుతారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం సరిగ్గా లేనందున ఇతర పనుల్లో దృష్టి పెట్టలేరు.

కర్కాటక రాశి: ఈ రోజు ఈ రాశివారికి ప్రజా సంబంధాలు మెరుగుపడతాయి. వ్యాపారంలో సానుకూల నిర్ణయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఏదైనా ఒప్పందం కుదుర్చుకునేటప్పుడు తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం మంచిది. ప్రేమ జీవితంలో చిన్న చిన్న పొరపాట్లను విస్మరించడం ప్రయోజనకరంగా ఉంటుంది.

సింహరాశి: ఈ రోజు ఈ రాశివారికి కలిసి వస్తుంది. ప్రత్యర్థుల కుట్ర విఫలమవుతుంది. పనికి రాని ఆలోచనలపై సమయాన్ని వృథా చేయకండి. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న శత్రుత్వం ఒప్పందం ద్వారా ముగుస్తుంది. కొన్ని కారణాల వల్ల ప్రేమ జీవితంలో దూరం పెరగవచ్చు. దీని వల్ల మీరు రోజంతా కలవరం పడుతారు.

కన్యారాశి: ఈ రోజు ఈ రాశివారికి ధార్మిక కార్యాలపై డబ్బు ఖర్చు చేయడం వల్ల మనస్సులో ఆనందంగా ఉంటుంది. వ్యాపారంలో మీ ప్రత్యర్థులకు మీరు తలనొప్పిగా మారతారు. వైవాహిక జీవితంలో సంతోషకరమైన పరిస్థితి ఉంటుంది. కార్యాలయంలో అక్కడక్కడ మీ పనులు చేస్తూ సమయాన్ని వృథా చేసుకోకండి.

తులారాశి: రహస్య శత్రువులు చురుకుగా ఉంటారు. కుటుంబ సభ్యులు కలవరం చెందుతారు. బంధువులు మీ ఉదార స్వభావాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. వ్యాపారంలో ఏదైనా ఆలోచనలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. సూర్యాస్తమయంలో కొంత ఉపశమనం లభిస్తుంది.

వృశ్చిక రాశి: ఈ రోజు ఈ రాశి వారికి మధ్యస్తంగా ఉంటుంది. కార్యాలయంలో అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. మీ ప్రేమికులతో కలిసి ట్రిప్ వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. ఈ కారణంగా మీ సంబంధం మరింత బలపడుతుంది. తండ్రి ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించండి. సాయంత్రం సమయంలో ఎక్కువగా గందరగోళంలో గడుపుతారు.

ధనుస్సు రాశి: ఈ రాశివారు ఈ రోజు పనుల్లో మీరు చాలా బిజీగా ఉంటారు. శారీరక, మానసిక క్షోభకు గురయ్యే అవకాశముంది. వినోదం కోసం ఎక్కువ ఖర్చు చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఇది మీ కుటుంబాన్ని సంతోషపరుస్తుంది. ప్రేమ జీవితంలో సమస్యలు ఉండవచ్చు.

మకరరాశి: ఈ రోజు కొంతమంది వ్యక్తులను కలవడం వల్ల భవిష్యత్తులో మీకు నూతన అవకాశాలు సిద్ధిస్తాయి. మంచి మనుషులను కలవడం ద్వారా మనస్సులో ఆనందం ఉంటుంది. ప్రభుత్వాధికారి సహాయంతో ఆస్తి, వివాదాలు పరిష్కరించుకుంటారు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి.

కుంభ రాశి: ఈ రోజు ఈ రాశి వారికి ఎక్కడి నుంచైనా డబ్బు పొందే అవకాశముంది. ఇంటి పెద్దల ఆశీర్వాదంతో పురోగతికి ప్రత్యేక అవకాశాలు లభిస్తాయి. సోదరులతో చాలా కాలంగా కొనసాగుతున్న వివాదాలు పరిష్కారమవుతుంది. స్నేహితుడు మీకు మంచి సలహాలు ఇస్తాడు. ఇవి మీకు ఉపయోగపడతాయి.

మీనరాశి: ఈ రోజు ఈ రాశివారికి కలిసి వస్తుంది. వ్యాపారంలో ఎక్కువ పెట్టుబడి పెట్టడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఏదైనా ప్లాన్ చేయడానికి ముందు దయచేసి మీ భాగస్వామిని ఒకసారి సంప్రదించండి. బయటి ఆహారం తీసుకోవడం నియంత్రించండి. లేకుంటే కడుపునొప్పి వంటి సమస్య ఉండవచ్చు.

Source: https://tv9telugu.com/astrology/horoscope-today-07-october-2021-check-astrological-prediction-for-aries-taurus-gemini-cancer-and-other-signs-553097.html

Leave Your Comment