logo

header-ad
header-ad

Horoscope Today: ఈ రాశివారు ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త..! నష్టపోయే అవకాశం

Horoscope Today (October 05-10-2021): ఈరోజులో కొత్తపనిని మొదలు పెట్టాలన్నా , శుభకార్యాలు మొదలు పెట్టాలన్నా జాతకాలు, రాశిఫలాల ఆధారంగా చేసేవారు చాలామంది ఉన్నారు. జాతకాలను విశ్వసిస్తూ పనిని మొదలుపెట్టే ముందు కొంతమంది ఈరోజు తమ జాతకం ఎలా ఉంది అంటూ.. తమ దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (అక్టోబర్ 5న ) మంగళవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో.. తెలుసుకుందాం..!

మేష రాశి: మేష రాశి వారు ఈరోజు సహోద్యోగి లేదా బంధువు కారణంగా ఆందోళన చెందుతారు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. లేకుంటే నష్టపోయే అవకాశముంది. వాహనాన్ని ఉపయోగించేటప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ ఖర్చులు అకస్మాత్తుగా పెరగడం వల్ల మానసిక ఒత్తిడిని అనుభవిస్తారు.

వృషభ రాశి: ఈ రాశి వారికి ఈ రోజు రాజకీయ మద్దతు లభిస్తుంది. మీ కుటుంబ ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించండి. స్నేహితులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. ఏదైనా అవకాశం చేజారిపోతుంది. వ్యాపార ప్రణాళికలు మంచి ఫలితాలను ఇస్తాయి.

మిధున రాశి: మిధున రాశివారు ఈ రోజు బహుమతులు, గౌరవాన్ని పొందుతారు. విద్యార్థులు విజయం కోసం ఏకాగ్రతను కొనసాగించాలి. ఏదైనా పని పూర్తయితే మీ స్వభావం, ఆధిపత్యం పెరుగుతుంది.

కర్కాటక రాశి: ఈ రాశివారికి ఈ రోజు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగం చేసే వారికి హోదా పెరుగుతుంది. పరీక్ష కోసం విద్యార్థులు చేసిన కృషి సార్థకం అవుతుంది. వ్యాపారంలో మరింత తెలివిగా పనిచేస్తే మీరు మరింత డబ్బు సంపాదించవచ్చు.

సింహరాశి: సింహ రాశి వారు ఈ రోజు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశాలున్నాయి. మీరు కుటుంబం నుంచి బహుమతులు, గౌరవం, ప్రయోజనాలు పొందుతారు. ఇతరుల సహకారం తీసుకోవడం వల్ల విజయం సాధిస్తారు. స్నేహితులతో ప్రయాణాలు ఆహ్లాదకరంగా ఉంటాయి.

కన్యారాశి: ఈ రాశివారు ఆహారం విషయంలో సంయమనం పాటించండి. కడుపునొప్పికి సంబంధించిన ఫిర్యాదులు ఉండవచ్చు. అనవసరమైన ఖర్చులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు ప్రతి సమస్యను ఎదుర్కొంటారు. భూమికి సంబంధించిన పెట్టుబడుల్లో ప్రయోజనాలు ఉంటాయి.

తులారాశి: తులా రాశి వారు రాజకీయ రంగంలో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేసుకుంటారు. సన్నిహితుడిని కలిసే అవకాశముంది. ఖర్చులను నియంత్రించండి. ఆదాయ, వ్యయాల మధ్య సమతూల్యతను పాటించండి. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.

వృశ్చిక రాశి: ఈ రాశివారు ఈరోజు పెండింగులో ఉన్న పనులు పూర్తి చేసుకుంటారు. కొన్ని వ్యాపార పనుల కారణంగా ఆకస్మిక పర్యటనలకు వెళ్లవచ్చు. వైవాహిక జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తారు. విలువైన వస్తువును కోల్పోయే అవకాశముంది. వ్యర్థ ఖర్చులను నియంత్రించండి.

ధనుస్సు రాశి: ధనుస్సు రాశివారు ఈ రోజు ఆర్థికంగా విజయాన్ని సాధిస్తారు. మీ ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించండి. బయట ఆహారం విషయంలో సంయమనం పాటించండి. అత్తమామల వైపు నుంచి ప్రయోజనం పొందుతారు.

మకరరాశి: ఈ రాశివారికి కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశముంది. కుటుంబ సభ్యులతో వినోదానికి అవకాశాలు ఉన్నాయి. ఇంటి సభ్యుడి కోసం వైవాహిక సంబంధిత ప్రతిపాదనలు రావచ్చు. మీరు నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఇప్పుడు సమయం సరిగ్గా లేదు.

కుంభ రాశి: కుంభ రాశివారు ఈ రోజు అత్తమామల వైపు నుంచి ప్రయోజనం అందుకుంటారు. కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండండి. లేకుంటే ఎవరితోనైనా గొడవలు, వివాదాలు ఉండవచ్చు. ఇతరుల ఒత్తిడితో ఏదైనా ముఖ్యమైన వ్యాపార ఒప్పందాన్ని కుదుర్చుకోవచ్చు. సరైన సమయంలో మీకు అనేక అవకాశాలు లభిస్తాయి.

మీనరాశి: ఈ రాశి వారు ఈ రోజు పెండింగులో ఉన్న పనులు పూర్తి చేసుకుంటారు. రాజకీయ సహకారం అందుబాటులో ఉంటుంది. ఆరోగ్యం పట్ల ఉదాసీనంగా ఉండకండి. మాటలపై సంయమనం పాటించండి. అది మీ సంబంధంలో తీపిని పెంచుతాయి. కుటుంబంతో కలిసి సరదాగా సమయాన్ని గడుపుతారు.

Source: https://tv9telugu.com/astrology/horoscope-today-05-october-2021-check-astrological-prediction-for-aries-taurus-gemini-cancer-and-other-signs-551796.html

Leave Your Comment