logo

header-ad
header-ad

హానర్ 10ఎక్స్ లైట్.. ధర, ఫీచర్లు

న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హానర్   మిడ్ రేంజ్ ల కొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది.  హానర్ 10ఎక్స్ లైట్‌ పేరుతో దీన్ని ఆవిష్కరించింది. లాంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రస్తుతానికి యూరప్, రష్య, సౌదీ అరేబియాలో లాంచ్ అయింది. ఇండియాలో ఎపుడు లాంచ్ చేసేది అధికారిక ప్రకటన లేదు. కానీ త్వరలో భారత మార్కెట్‌లో  కూడా విడుదల కానుందని అంచనా.  భారత కరెన్సీలో  దీని ధర సుమారు రూ.15,900 ఉండనుంది. ఈ ఫోన్ మిడ్ నైట్ బ్లాక్, ఐస్‌ల్యాండిక్ ఫ్రాస్ట్, ఎమరాల్డ్ గ్రీన్ రంగుల్లో లభ్యం. ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు.

హానర్ 10ఎక్స్ లైట్‌ ఫీచర్లు

6.67 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్ ప్లే

ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం

కిరిన్ 710 ప్రాసెసర్, 

48+8+2+2 క్వాడ్  రియర్ కెమెరా సెటప్,

8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా,

4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్

256 జీబీదాకా విస్తరించుకునే అవకాశం

5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Source: https://www.sakshi.com/telugu-news/business/honor-10x-lite-new-mid-range-smartphone-1324833

Leave Your Comment