విశాఖపట్నానికి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ హనీ గ్రూప్‌నకు ఏషియా వన్ మేగజైన్ మరియు యూఆర్‌ఎస్ ఇంటర్నేషనల్ అవార్డ్ దక్కింది. 2018–19 సంవత్సరానికి గాను గ్రేటెస్ట్ రియల్ ఎస్టేట్ బ్రాండ్ అండ్ లీడర్స్ అవార్డ్‌లకు హనీ గ్రూప్ సీఎండీ ఎం ఓబుల్ రెడ్డి ఎంపికయ్యారని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 20 ఏళ్ల సేల్స్ రంగ అనుభవంలో కస్టమర్లకు సంతృప్తికరమైన సేవలు అందించినందుకు గాను ఈ అవార్డులు దక్కాయని, చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ప్రతికూల మార్కెట్ పరిస్థితుల సమయంలోనూ ప్రాపర్టీలను అందుబాటు ధరల్లో కొనుగోలుదారులకు అందించినందుకే హనీ గ్రూప్‌నకు ఈ గుర్తింపు వచ్చిందని చెప్పారు. ఇటీవల ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ముంబైలో ఇటాలియన్ రిపబ్లిక్ కాన్సుల్ జనరల్ స్టెఫానియా, మలేషియా కాన్సుల్ జనరల్ జైనాల్ అజ్లాన్ నజీర్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు.
ఎంపిక ఎలా అంటే?
యునైటెడ్ రీసెర్చ్ సర్వీసెస్ ఇంటర్నేషనల్ ప్రైమరీ, సెకండరీ డేటా ఆధారంగా ఇండిపెండెంట్ జ్యూరీ సభ్యులు, ఏషియా వన్ మేగజైన్ ఎడిటోరియల్ బృందం ఈ అవార్డులను ఎంపిక చేసింది. 2018–19 సంవత్సరానికి గాను ఇండియాలోని 100 గ్రేటెస్ట్ బ్రాండ్స్ మరియు లీడర్స్‌ను ఎంపిక చేసింది. దేశ వ్యాప్తంగా 16 ఇండస్ట్రీలు, 62 సబ్ కేటగిరీల్లో ఈ అవార్డులకు కంపెనీలను ఎంపిక చేశారు.
డీమోనిటైజేషన్‌లోనూ ఉద్యోగాలు..
హనీ గ్రూప్‌నకు ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (ఏపీ రెరా), తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీఎస్ రెరా), కర్నాటక రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (కె రెరా)లో సభ్యత్వం ఉంది. 2016లో డీమోనిటైజేషన్ తర్వాత దేశంలోని రియల్ ఎస్టేట్ రంగంలో 425 మంది ఉద్యోగులను, 15 బ్రాంచీలను ప్రారంభించిన ఏకైక రియల్ ఎస్టేట్ కంపెనీ హనీగ్రూపే అని ఓబుల్ రెడ్డి తెలిపారు.
ఎండ్ టు ఎండ్ రియల్టీ సేవలు..
విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాల్లో ఓపెన్ ప్లాట్లు, అపార్ట్‌మెంట్లు, ఇండిపెండెంట్ గృహాలు, విల్లాలు అందుబాటు ధరల్లో ఉన్నాయి. మధ్యవర్తులు వంటి వాళ్లు లేకుండా నేరుగా డెవలపర్ల నుంచి కొనుగోలుదారులకు ప్రాపర్టీలను చేర్చుతుంది. దీంతో కొనుగోలుదారులకు డబ్బు ఆదా అవటమే కాకుండా నాణ్యమైన ప్రాజెక్ట్‌ల ఎంపిక సులువు అవుతుంది. హనీ గ్రూప్‌లో పనిచేసే ఉద్యోగులు అందరూ కంపెనీ ఎంప్లాయిసే. ఎలాంటి ఏజెంట్లు గానీ, మధ్యవర్తులు గానీ ఉండరు. కస్టమర్ల అవసరాలను తగ్గట్టుగా బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీల నుంచి రుణాలు ఇప్పించడం, ఇంటీరియర్ వంటి అన్ని రకాల రియల్ ఎస్టేట్ అవసరాలను ఉచితంగా తీరుస్తుంది. 90 శాతం వరకు బ్యాంక్ రుణాలను ఇప్పిస్తుంది.
హనీ గ్రూప్ కంపెనీ గురించి..
హనీ గ్రూప్ ఐఎస్‌ఓ 9001:2015 సర్టిఫైడ్ కంపెనీ. హనీ గ్రూప్‌ను సొంత ప్రాజెక్ట్‌లతో పాటూ దక్షిణ భారతదేశంలోని ఇతర డెవలపర్ల ప్రాజెక్ట్‌లను విక్రయించి పెడుతుంది. ప్రస్తుతం హనీగ్రూప్ 700లకు పైగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లను కలిగి ఉంది. సుమారు 3 వేలకు పైగా కస్టమర్లు ఉన్నారు. సేల్స్ రంగంలో రెండు దశాబ్ధాలకు పైగా అనుభవం ఉన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్త ఎం. ఓబుల్ రెడ్డి హనీ గ్రూప్‌ను ప్రారంభించారు. 2016 జనవరి 7వ తేదీన 1 బ్రాంచీ, 9 మంది ఉద్యోగులు, 1 డెవలపర్, 1 ప్రాజెక్ట్‌తో ప్రారంభమైన హనీ గ్రూప్‌నకు 40 నెలల్లో 16 బ్రాంచీలు, 500లకు పైగా ఉద్యోగులు, 450కి పైగా డెవలపర్లు, 700లకు పైగా ప్రాజెక్ట్‌లకు విస్తరించింది. స్థానిక మార్కెట్ పరిస్థితులకు, కస్టమర్ల అభిరుచులకు తగ్గ ప్రాజెక్ట్‌లను, గృహాలను ఎంపిక చేసి కొనుగోలుదారులకు అందజేస్తుంది.