logo

header-ad
header-ad

స్కూటర్లలో మాస్టర్ హీరో మ్యాస్ట్రో ఎడ్జ్ వచ్చేసింది..

ప్రముఖ వాహన సంస్థ హీరో తన మ్యాస్ట్రో ఎడ్జ్ 110 స్కూటర్ ను బీఎస్6 ఫార్మాట్లో అప్డేట్ చేసి భారత మార్కెట్లో విడుదల చేసింది. ఎక్స్ షోరూంలో ఈ స్కూటర్ ప్రారంభ ధర వచ్చేసి రూ.60,950లుగా నిర్దేశించింది. దీని టాప్ వేరియంట్ ధర వచ్చేసి రూ.62,450లుగా ప్రకటించింది.

బీఎస్6 హీరో మ్యాస్ట్రో ఎడ్జ్

ప్రస్తుతం ద్విచక్రవాహనాల్లో స్కూటర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. అందుబాటులో ధరతో పాటు చిన్న చిన్న గమ్యాలకు చేరడానికి ఇవి బాగా ఉపకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ వాహన సంస్థ హీరో మోటోకార్ప్ సరికొత్త స్కూటర్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. అదే హీరో మ్యాస్ట్రో ఎడ్జ్ 110 బీఎస్6. దీన్ని బీఎస్6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా అప్డేట్ చేసి భారత మార్కెట్లో విడుదల చేసిందీ వాహన సంస్థ. ఎక్స్ షోరూంలో హీరో మ్యాస్ట్రో ఎడ్జ్ 100 ప్రారంభ ధర వచ్చేసి రూ.60,950లుగా సంస్థ నిర్దేశించింది. బీఎస్6 ఇంజిన్ తో పాటు ఇతర ఫీచర్లను కూడా అప్డేట్ చేసింది హీరో సంస్థ.

వేరియంట్ల వారీగా ధర..

హీరో మ్యాస్ట్రో ఎడ్జ్ 110 బీఎస్6 స్కూటర్ రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. వేరియంట్ల వారీగా ధరలో వ్యత్యాసముంచింది. ఈ సరికొత్త మ్యాస్ట్రో ఎడ్జ్ టాప్ వేరియంట్ ఎఫ్ 1 ధర వచ్చేసి 62,450లుగా నిర్దేశించింది. అంతే కాకుండా ఈ టాప్ వేరియంట అల్లాయ్ వీల్స్ ను కలిగి ఉంది.

ఇంజిన్..

ఈ సరికొత్త మ్యాస్ట్రో ఎడ్జ్ 110 బీఎస్6 స్కూటర్ ఇంజిన్ ను బీఎస్4 మోడల్లో ఉన్న మాదిరే ఉంచారు. ఈ సరికొత్త స్కూటర్ 110.9సీసీ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ ను కలిగి ఉంది. అంతేకాకుండా మైలేజి మెరుగుదల కోసం ఇందులో ఎక్స్ సెన్స్ టెక్నాలజీని ఉపయోగించారు. ఇది 7500 ఆర్పీఎం వద్ద 8 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 5500 ఆర్పీఎం వద్ద 8.75 ఎన్ఎం టార్క్ ను ఉపయోగిస్తుంది.

2020 హీరో మ్యాస్ట్రో ఎడ్జ్

ప్రత్యేకతలు..

ఈ మ్యాస్ట్రో ఎడ్జ్ బీఎస్6 మోడల్లో పికప్ ను మెరుగుపరిచారు. అంతేకాకుండా ఎలాంటి వాతావరణంలోనైనా సులభంగా స్టార్ట్ అయ్యేందుకు ఈజీ స్టార్ట్ ఉంది. కొండలు, గతుకుల్లోనూ మృధువుగా వెళ్లేందుకు స్మూథర్ రైడ్ ఆప్షన్ ఉంది. ఇవి కాకుండా హాలోజెన్ హెడ్ ల్యాంపులు, ఎల్ఈడీ టెయిల్ ల్యాంపులు, డ్యూయల్ టోన్ రేర్ వ్యూ మిర్రర్లు, కాంబినేషన్ లాక్, ఎక్సటర్నల్ ఫ్యూయల్ ఫిల్లర్, సెమీ డిజిటల్ ఇన్ స్ట్రూమెంట్ క్లస్టర్, సర్వీస్ రీమైండెర్, సైడ్ స్టాండ్ ఇండికేటర్ లాంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా సీటు కింద స్టోరేజీతో పాటు యూఎస్బీ ఛార్జింగ్ సదుపాయాన్ని పొందుపరిచారు. బూట్ లైట్, రేర్ గ్రాబ్ రెయిల్స్, డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ను ఇందులో ఉన్నాయి.

కలర్స్..

ఈ సరికొత్త స్కూటర్ ఆరు కొత్త కలర్ ఆప్షన్లతో అదుబాటులోకి వచ్చింది. పెరల్ ఫ్యాడ్ లెస్ వైట్, మిడ్ నైట్ బ్లూ, క్యాండీ బ్లేజింగ్ రెడ్, టెక్నో బ్లూ, ప్యాంథర్ బ్లాక్, సీల్ సిల్వర్ ను కలిగి ఉంది. హీరో మ్యాస్ట్రో ఎడ్జ్ స్కూటర్లో 110 డైమెన్షన్లో 1843 ఎంఎం పొడవు, 715 ఎంఎం వెడల్పు, 1188 ఎంఎం ఎత్తు, 1261 వీల్ బేస్ ను కలిగి ఉంది. రైడర్ సీటు ఎత్తువ వచ్చేసి 775ఎంఎం ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్155 ఎంఎం ఉంది. 5 లీటర్ ఇంధన ట్యాంకు సామర్థ్యంతో పాటు 112 కేజీల బరువును కలిగి ఉందీ టూ-వీలర్. ఇవి కాకుండా ఫ్రంట్ వైపు టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనక భాగంలో రేర్ షాక్ అబ్జార్బర్లతో పాటు డ్రమ్ బ్రేకింగ్ సెటప్ ను కలిగి ఉంది.

Source: https://telugu.samayam.com/automobile/bikes/hero-maestro-edge-110-bs6-launched-in-india/articleshow/78078242.cms

Leave Your Comment