logo

header-ad
header-ad

రూ.1995కే హర్మానో స్పోర్టో వైర్‌లెస్‌ ఇయర్‌ఫోన్స్‌

హర్మానా కంపెనీ స్పోర్టో పేరిట నూతన వైర్‌లెస్‌ ఇయర్‌ఫోన్స్‌ను భారత్‌లో విడుదల చేసింది. బ్లూటూత్‌ 5.0 ద్వారా ఈ ఇయర్‌ఫోన్స్‌ ఫోన్లకు కనెక్ట్‌ అవుతాయి. ఇవి కేవలం 22 గ్రాముల బరువును మాత్రమే కలిగి ఉన్నాయి. అందువల్ల వీటిని చాలా తేలిగ్గా క్యారీ చేయవచ్చు. ఇక 180 ఎంఏహెచ్‌ బ్యాటరీని వీటిలో ఏర్పాటు చేసినందున ఈ ఇయర్‌ఫోన్స్‌ 16 గంటల వరకు నాన్‌స్టాప్‌గా పనిచేస్తాయి. కేవలం 1.5 గంటల వ్యవధిలోనే ఈ ఇయర్‌ఫోన్స్‌ పూర్తిగా చార్జింగ్‌ అవుతాయి. రూ.1995 ధరకు వీటిని వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.

Source: https://www.ntnews.com/science-technology/harmano-sporto-wireless-earphones-launched-in-india-7110

Leave Your Comment