logo

header-ad
header-ad

ఇన్ స్టాగ్రామ్ మీద హ్యాకర్లు...

బెంగళూరు : ఇటీవలి కాలంలో ఫోటోలు, వీడియోలను ఇతరులతో పంచుకునే సామాజిక మాధ్యమ వేదిక ఇన్ స్టాగ్రామ్ ను వినియోగించేవారి సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది.  ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేసుకుంటూ.. అవసరమైన సెలెబ్రిటీలను ఫాలో అవుతూ.. మీమ్స్ చదువుకుంటూ గడిపేయొచ్చు అని అనుకుంటూ ఉంటారు. అందుకోసమే  విపరీతామైన ఆదరణ ఇన్ స్టాగ్రామ్ కు పెరిగింది. అలాగే ఇంస్టాగ్రామ్ మీద హ్యాకర్లు కూడా ఎక్కువగానే దృష్టి పెట్టారు. అకౌంట్స్ ను హ్యాక్ చేయడమే పనిగా పెట్టుకున్న వాళ్లు కూడా ఉన్నారు. తాజాగా అందులో సరికొత్త బగ్ ప్రవేశించింది.

సైబర్ సెక్యూరిటీ నిపుణులు అంచనా ప్రకారం ఈ బగ్ సాయంతో ప్రపంచంలో ఎక్కడ్నించి అయినా ఇన్ స్టాగ్రామ్ లోని అకౌంట్లలో అనుమతి లేకుండా ప్రవేశించవచ్చట. అలా జేపీఈజీ ఫార్మాట్ లో వచ్చిన ఫోటో మీద ఒక సారి క్లిక్ చేసి.. మళ్ళీ ఇంస్టాగ్రామ్ ను ఓపెన్ చేస్తే రిమోట్ యాక్సెస్ టూల్ అన్నది మొబైల్ లోకి చేరిపోయినట్లేనట.. ఇలా జరిగితే నెటిజన్ల పర్సనల్ మెసేజ్ లు చదవడంతో పాటు, యూజర్ల టైమ్ లైన్ లో ఏదైనా పోస్టు చేసే అవకాశం ఉంది. వారి కాల్ లిస్టు, కెమెరా, లొకేషన్ సమాచారం ఈ బగ్ అధీనంలోకి వెళతాయట. హ్యాకర్లు ముందుగా జేపీఈజీ ఫార్మాట్ లో ఉన్న ఓ ఇమేజ్ పంపుతారు.

ఆ ఇమేజ్ ను ఎవరైనా డౌన్ లోడ్ చేసుకున్నారంటే బగ్ ఎంట్రీ ఇచ్చేసినట్లే.. తద్వారా హ్యాకర్లు ఏదైనా చేసే అవకాశం ఉంటుంది. ఈ విషయమై సైబర్ నిపుణులు ఇన్ స్టాగ్రామ్ మాతృసంస్థ ఫేస్ బుక్ ను అప్రమత్తం చేయడంతో బగ్ నివారణకు అవసరమైన చర్యలు తీసుకున్నది. సైబర్ అటాక్స్ జరుగుతూనే ఉంటాయని.. సంస్థలు మాత్రమే కాదు, యూజర్లు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని నిపుణులుహెచ్చరిస్తున్నారు. 

Source: https://www.ntnews.com/science-technology/hackers-on-instagram-if-you-click-on-that-photo-83851

Leave Your Comment