logo

header-ad
header-ad

గూగుల్ పే యూజర్లకు షాకింగ్ న్యూస్!

ప్రముఖ డబ్బులు చెల్లింపుల సంస్థ అయిన గూగుల్ పే వినియోగదారులకు షాకింగ్ న్యూస్ తెలిపింది. వచ్చే ఏడాది జనవరి నుండి గూగుల్ పే వెబ్​యాప్ సేవల నిలివేయనున్నట్లు తెలిపింది. అలాగే గూగుల్ పే నుండి తక్షణ నగదు బదిలీ చేసినందుకు గాను ఛార్జీలు వసూలు చేసే యోచనలో గూగుల్ పే ఉన్నట్లు తెలుస్తోంది. గూగుల్ పే వినియోగదారులు ఇప్పటి వరకు డబ్బులు పంపించడానికి గూగుల్ పే యాప్ లేదా గూగుల్ పే వెబ్ ను ఉపయోగించే వారు.

"2021 ప్రారంభంలో, మీరు ఇతర వ్యక్తుల నుండి డబ్బు పంపించడానికి, స్వీకరించడానికి pay.google.com ను ఉపయోగించలేరు. కాబట్టి ఇక నుండి కొత్త గూగుల్ పే యాప్ ను ఉపయోగించండి" అని కంపెనీ సమాచారం ఇచ్చింది. గూగుల్ పే వెబ్​ యాప్​లో.. పీర్​-టూ-పీర్ పేమెంట్​ సదుపాయాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి నిలిపేసేందుకు సిద్ధమైంది. మొబైల్ యాప్ సేవలు మాత్రం కొనసాగనున్నాయి. ఐఓఎస్​, ఐఓఎస్​ యూజర్లకు గూగుల్ పే సరికొత్త ఫీచర్లను ఇటీవలే పరిచయం చేసింది. తొలుత అమెరికాలోని వినియోగదారులకు ప్రయోగాత్మకంగా ఈ ఫీచర్లు అందించి.. మిగతా యూజర్లకు ఇటీవలే ఈ ఫీచర్లను తీసుకొచ్చింది.

Source: sakshi.com/telugu-news/business/google-pay-web-app-stop-working-january-2021-1329459

Leave Your Comment