logo

header-ad
header-ad

విమానం టాయ్‌లెట్‌లో 5.6 కిలోల బంగారం

చెన్నై : విమానం టాయిలెట్‌లో దాచి ఉంచిన రూ. రూ.2.24 కోట్లు విలువ చేసే బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  ఈ ఘటన చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దుబాయ్‌ నుంచి భారీగా బంగారం అక్రమ రవాణా చేస్తున్నట్టు కస్టమ్స్‌ అధికారులకు సమాచారం అందింది. ఈ మేరకు అధికారులు ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు నిర్వహించారు.

మంగళవారం దుబాయ్‌ నుంచి చెన్నై చేరుకున్న ఎయిర్‌ ఇండియా విమానంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. విమానం వెనక భాగంలోని టాయిలెట్‌లో నలుపు రంగులో నాలుగు ప్యాకెట్లు కనిపించాయి. దీంతో కస్టమ్స్‌ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. అందులో రూ. 5.6 కిలోల బరువు ఉన్న 48 బంగారు కడ్డీలను అధికారులు గుర్తించారు. ఆ బంగారం విలువ దాదాపు రూ. 2.24 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.  ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్టు వెల్లడించారు. కాగా, దుబాయ్‌ నుంచి చెన్నై వచ్చిన ఆ విమానం.. అనంతరం సర్వీస్‌ నంబర్‌ మార్చుకుని ఢిల్లీ బయలుదేరి వెళ్లాల్సి ఉంది.

Source: https://www.sakshi.com/news/crime/gold-bars-found-plane-toilet-chennai-airport-1237946

Leave Your Comment