భూమి మీద నివసిస్తున్న అనేక మందిలో శాకాహారులు ఉంటారు. మాంసాహారులు ఉంటారు. ఈ క్రమంలోనే కేవలం శాకాహారం మాత్రమే తీసుకోవడం వల్ల కార్బన్ ఉద్గారాల శాతం తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుందని ఇప్పటి వరకు అంతా భావించారు. అయితే అది ఎంత మాత్రం నిజం కాదని తేలింది. నిజానికి పూర్తిగా శాకాహారమే తీసుకోవడం వల్లనే కార్బన్ ఉద్గారాలు గాలిలో ఎక్కువగా పెరిగి దాంతో పర్యావరణానికి నష్టం కలుగుతుందని సైంటిస్టులు చేపట్టిన తాజా అధ్యయనాల్లో వెల్లడైంది.
అమెరికాలోని బాల్టిమోర్ జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ (జేహెచ్‌యూ)కు చెందిన పరిశోధకులు వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ డైట్ల వల్ల పర్యావరణానికి కలిగే నష్టంపై తాజాగా అధ్యయనాలు చేపట్టారు. దాంతో తేలిందేమిటంటే.. పూర్తిగా శాకాహారమే తింటే ఆ డైట్ వల్ల పర్యావరణంలోకి చేరే కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల శాతం పెరుగుతుందని, అదే అప్పుడప్పుడూ మాంసాహారం కూడా తింటే ఆ శాతం తగ్గుతుందని.. దీంతో పర్యావరణానికి మేలు కలుగుతుందని.. గుర్తించారు. ఈ క్రమంలోనే సైంటిస్టులు పూర్తిగా శాకాహారమే కాకుండా అప్పుడప్పుడు మాంసాహారం కూడా తినాలని, దాంతో పర్యావరణాన్ని రక్షించుకోవచ్చని సూచిస్తున్నారు..!