logo

header-ad
header-ad

పాస్‌వర్డ్స్‌ మరిచిపోతున్నారా? అయితే, ఇది మీ కోసమే..!

ప్రస్తుత రోజుల్లో ఆన్‌లైన్ సేవలను ఉపయోగించడం సర్వసాధారణంగా మారింది. ఇంటర్నెట్ కేవలం ఒక క్లిక్ దూరంలో ఉండటంతో ఈ సేవల్లో ఎక్కువ భాగం ఆన్‌లైన్‌ సేవలను వినియోగించుకుంటున్నారు. అయితే, పాస్‌వర్డ్‌లను గుర్తుపెట్టుకోవడం చాలా కష్టమైన పనిగా.. తలనొప్పిగా తయారైంది. ఇతరులు గుర్తుపట్టకుండా పెట్టుకోవడం ఒక ఎత్తైతే.. వాటిని గుర్తుపెట్టుకోడం మరో ఎత్తుగా తయారైంది. పాస్‌వర్డ్‌లు తప్పుగా ఇస్తే ఖాతాలు లాక్ అవ్వడం వంటి సమస్యలకు దారితీస్తుండటంతో వాటిని నోట్‌ చేసి పెట్టుకోవడం చాలా ఇబ్బందికరంగా తయారైంది. దీనికి పరిష్కారమార్గంగా మైక్రోసాఫ్ట్‌ నిర్వాహకులు ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ప్లాట్‌ఫామ్‌లలో ఎడ్జ్‌, క్రోమ్‌, మొబైల్ వినియోగదారుల కోసం పాస్‌వర్డ్‌ మేనేజర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

మైక్రోసాఫ్ట్ నుంచి అందుబాటులోకి వస్తున్న పాస్‌వర్డ్ మేనేజర్ స్టాండలోన్‌ యాప్‌ కాదు. రెండు కారకాల ప్రామాణీకరణను ఉపయోగించే మైక్రోసాఫ్ట్ సేవలకు సైన్ఇన్‌లను ప్రామాణీకరించడానికి ఉపయోగించే మైక్రోసాఫ్ట్ ఆథెంటికేటర్ యాప్‌లో విలీనం చేశారు. ఎడ్జ్ బ్రౌజర్‌లోని మైక్రోసాఫ్ట్ ఖాతాతో సింక్‌ చేసిన పాస్‌వర్డ్‌లు క్రోమ్‌, ఎడ్జ్ బ్రౌజర్‌లలోని యాప్‌లు లేదా వెబ్‌సైట్లలో.. అలాగే ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ పరికరాల్లో స్వయంచాలకంగా నింపబడతాయి. 

మైక్రోసాఫ్ట్ యూజర్లు మాత్రమే పాస్‌వర్డ్ మేనేజర్ ప్రయోజనాలను పొందుతారు. గూగుల్‌ ఖాతాను ఉపయోగించి క్రోమ్‌ ద్వారా పాస్‌వర్డ్ నిర్వహణను అనుమతిస్తుంది. పాస్‌వర్డ్ నిర్వహణకు బహుశా ఇదే లాస్ట్‌పాస్‌గా చెప్పుకోవచ్చు. ఇది గూగుల్ లేదా మైక్రోసాఫ్ట్ ఖాతాతో సంబంధం లేకుండా అనేక ప్లాట్‌ఫామ్‌లలో లభిస్తుంది. మైక్రోసాఫ్ట్ ఆథెంటికేటర్ పాస్‌వర్డ్ నిర్వహణ సాధనాన్ని బీటా వెర్షన్‌గా రూపొందుతున్నది. ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. క్రొత్త పాస్‌వర్డ్ నిర్వహణ సేవలను ఉపయోగించడానికి మైక్రోసాఫ్ట్ ఖాతా ఉండాలి. కానీ, ఎంటర్‌ప్రైజ్ ఖాతా ఉన్న వ్యక్తులు మాత్రం ఈ సేవలను వినియోగించలేరు.

Source: https://www.ntnews.com/science-technology/can-t-remember-passwords-here-is-a-solution-112098

Leave Your Comment