logo

header-ad
header-ad

కరోనాను కూడా వాడుకుంటున్న కేటుగాళ్ళు తస్మాత్ జాగ్రత్త..

కరోనాతో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ లాక్‌డౌన్‌ వివిధ రంగాలపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్బీఐ టర్మ్ లోన్స్ ,రిటైల్ ,క్రాప్ లోన్స్ తో పాటు క్యాపిటల్ పేమెంట్స్ కు మూడు నెలల మారిటోరియం విధిస్తున్నట్టు ప్రకటించింది. లోన్లు,క్రెడిట్ కార్డుల పేమెంట్ లకు మూడు నెలల గడువు ఇచ్చింది. ఇదే అవకాశంగా తీసుకుని సైబర్ మోసగాళ్లు ఈఎంఐల మారటోరియం సేవల పేరుతో అకౌంట్ ల నుంచి డబ్బులులాగే ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీంతో అకౌంట్ హోల్డర్స్ ను అప్రమత్తం చేస్తున్నాయి ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు. ఇప్పటికే స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఖాతాదారులను అలర్ట్ చేసింది. 

సైబర్ నేరగాళ్ల మోసాలు ఎలా సాగుతున్నాయంటే  పేమెంట్స్ ను వాయిదా వేయించేందుకు సహాయం అందిస్తామని కొందరు ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేస్తారు. అకౌంట్  వివరాలతో పాటు ఓటిపి,సివివి ,పాస్ వర్డ్ లేదా పిన్ నెంబర్ అడుగుతారు. ఒక వేళ సైబర్ మోసగాళ్లకు ఈ వివరాలు అందిస్తే మీ ఖాతాలు ఖాళీ అవుతాయి.కాబట్టి అకౌంట్స్ ,కార్డుల వివరాలు చెప్పే ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తాజాగా యాక్సిస్ బ్యాంకు అకౌంట్ హోల్డర్స్ కు ఈ మెయిల్ పంపింది .ఈఎంఐ మారిటోరియమ్ మోసాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఖాతాదారులను కోరింది బ్యాంకు. సైబర్ కేటుగాళ్లకు చాన్స్ ఇవ్వకుండా బ్యాంకుల ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది .బ్యాంకుల నుంచే ఫోన్ కాల్స్ వచ్చిందా లేదా తెలుసుకుని జాగ్రత్తగా వ్యవహరించడంపై ఖాతాదారులు దృష్టి పెట్టాలి.

 

Source: https://www.ntvtelugu.com/post/emi-moratorium-fraud-banks-asking-customers-to-be-alert

Leave Your Comment