logo

header-ad
header-ad

‘రేప్ ఎలా చేద్దాం’ విద్యార్థుల వాట్సాప్ చాట్.. భయపడుతోన్న అమ్మాయిలు!

ఈ దరిద్రపు సమాజం పిల్లలను మంచి మార్గంలో తీసుకెళ్లకపోయిన ఫర్వాలేదు గానీ.. చెడు దారుల్లో మాత్రం తీసుకెళ్లకూడదని ప్రతీ తల్లిదండ్రులూ కోరుకుంటున్నారు. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే వాళ్ళ ఆశలు ఎప్పటికీ అడియాసలుగానే మిగిలిపోతాయని అనిపిస్తోంది. ఇక రీసెంట్‌గా ముంబైలోని టాప్ ఐబీ స్కూల్‌కి చెందిన 13,14 సంవత్సరాల వయసున్న విద్యార్థులు తోటి అమ్మాయిల గురించి దారుణంగా ఆలోచిస్తూ.. వాళ్ల గురించి సెక్స్యువల్ కామెంట్స్‌తో చాట్ చేయడమే కాకుండా.. వారిని ‘రేప్’ చేద్దామా.. లేక ‘గ్యాంగ్ రేప్’ అని వాట్సాప్‌లో చేసుకున్న చాటింగ్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని గుర్తించిన వారిలో ఓ విద్యార్థి తండ్రి స్కూల్ యాజమాన్యానికి కంప్లైంట్ చేయడంతో ఆ ఎనిమిది మంది విద్యార్థులను సస్పెండ్ చేయడం జరిగింది.

జాతీయ మీడియాలో ప్రచురించిన కథనం ప్రకారం.. ఈ ఎనిమిది మంది విద్యార్థులు ఇద్దరు విద్యార్థినుల గురించి చాలా దారుణంగా, అసభ్యకరంగా వాట్సాప్ గ్రూప్ చాట్ చేశారు. ‘దాన్ని దారుణంగా …. ’ ‘ఆమె అస్తిత్వాన్ని నాశనం…’ ‘రేప్ చేసి చంపేద్దామా..’ అంటూ చాటింగ్ చేసుకున్నారు. అంతేకాక వీళ్లందరూ ‘రేప్’ అనే పదం ఎక్కువగా ఉపయోగించారు. ‘వాడిని వాళ్ల నాన్న రేప్..’ ‘రేప్ చేయలేదా.. ‘ ‘గే’, ‘లెస్బియన్’ వంటి పదాలను కూడా వాడారు. కాగా, ఈ వాట్సాప్ చాటింగ్ విషయాలన్నీ వెలుగులోకి రావడంతో అమ్మాయిలు స్కూల్‌కి రావాలంటే భయపడిపోతున్నారు.

 

 

Source: https://tv9telugu.com/eight-students-from-top-ib-school-suspended-for-whats-app-rape-rant-against-girls-175553.html

Leave Your Comment