logo

header-ad
header-ad

ఒకే బైక్‌.. 71 కేసులు !

  • రూ. 15 వేలు జరిమానా
  • ఏడాదిగా తప్పించుకు తిరుగుతున్న బైక్‌ చోదకుడు  
  • సిగ్నల్‌ జంపింగ్‌లు, త్రిబుల్‌ రైడింగ్‌ కేసులు
  • రెండు మీటర్ల పొడవుతో జరిమానా బిల్లు

యశవంతపుర: ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించిన బైక్‌ చోదకుడిపై 70 కేసులు నమోదు కాగా జరిమానా రూ. 15 వేలు విధించిన సంఘటన బెంగళూరులో జరిగింది. గురువారం రాజాజీనగర ట్రాఫిక్‌ పోలీసులు మహలక్ష్మీ లేఔట్‌ శంకరనగర బస్టాండ్‌ వద్ద హెల్మెట్‌ లేకుండా వెళ్తున్న బైక్‌ చోదకుడు మంజును పోలీసులు ఆపారు. బైక్‌ నంబర్‌ కేఏ 41–ఇజి6244 ఆధారంగా అతడికి హెల్మెట్‌ లేని కారణంగా జరిమానా విధించాలని పోలీసులు పరిశీలించారు. జరిమానా రశీదు ఏకంగా రెండు మీటర్ల పొడవుతో జరిమానా బిల్లు వచ్చింది. దీంతో పోలీసులు అవాక్కయ్యారు. ఏడాదిగా అతడిపై 70 కేసులు నమోదైనట్లు పెద్ద స్లిప్‌ వచ్చింది. తాజా కేసులో మొత్తం 71 కేసులు అతడిపై నమోదయ్యాయి. హెల్మెట్‌ లేకుండా, త్రిబుల్‌ రైడింగ్, సిగ్నల్‌ జంపింగ్‌ కేసులు ఉన్నాయి.

కెమెరాలు పట్టేస్తాయి : బెంగళూరు నగరంలో ఏర్పాటు చేసిన కెమెరాలు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎప్పటికైనా దొరకడం ఖాయమని చెబుతున్నాయి. ఏడాదిగా తప్పించుకు తిరుగుతున్న ఓ బైక్‌ చోదకుడి తాజాగా దొరకడమే ఇందుకు నిదర్శనం. పోలీసులు లేరని సిగ్నల్‌ జంప్‌ చేసినా కెమెరాలో దొరికిపోతారు. ఈ కెమెరాలో ఫొటోలు తీసి కంట్రోల్‌ రూమ్‌కు పంపుతాయి. దీంతో పోలీసులు కేసులు నమోదు చేయవచ్చని స్పష్టం చేస్తోంది. వాహనదారులు ట్రాఫిక్‌ నియమాలు ఉల్లఘించకుండా వాహనాలను జాగ్రత్తగా నడపాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.  

Source: https://www.sakshi.com/news/crime/71-challans-scooty-karnataka-1248026

Leave Your Comment