logo

header-ad
header-ad

‘బిగ్ బాస్ 4’కి హోస్ట్ గా మెగాస్టార్ ?

ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన ‘బిగ్ బాస్ 1’ బుల్లి స్క్రీన్ ను ఎంతటి ఉరూతలు ఊగించిందో ప్రత్యేకంగా చెప్పక్కనర్లేదు. కానీ నాని హోస్ట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘బిగ్ బాస్ 2’ మాత్రం ఆ స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయినా.. అక్కినేని నాగార్జున హోస్ట్ గా వచ్చిన మూడో సీజన్ మాత్రం బాగానే ఆకట్టుకుంది. ఈ సీజన్ లో మొత్తం 17 కంటెస్టెంట్స్ తో హోరా హోరీగా సాగి చివరికి విజేతగా రాహుల్ నిలిచాడు. మొత్తానికి బుల్లితెర‌ పై సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న ఈ రియాలిటీ షో నుండి రాబోయే సీజన్ 4 గురించి అప్పుడే రూమర్స్ మొదలయ్యాయి.

ఈ సారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 4కి హోస్ట్ గా మెగాస్టార్ చేస్తున్నారని.. అందుకే నిన్న జరిగిన సీజన్ 3 ఫైనల్ కి చిరంజీవి వచ్చారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్త పై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన అయితే లేదు. కానీ, బిగ్ బాస్ కి మెగాస్టార్ హోస్ట్ గా చేస్తే మాత్రం ఆ సీజన్ సూపర్ హిట్ అవ్వడం ఖాయం. ప్రస్తుతం మెగాస్టార్ కొరటాల శివతో సినిమా చేయడానికి సన్నద్ధం అవుతున్నారు.

Source: https://www.123telugu.com/telugu/news/chiranjeevi-to-host-bigg-boss-4.html

Leave Your Comment