logo

header-ad
header-ad

చిరంజీవి చెప్పినట్లు ఇండస్ట్రీ దూరం పెట్టాల్సిన 'ఆ వ్యక్తి' ఎవరు?

టాలీవుడ్ లో ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) ఎన్నికల హడావిడి ముగిసింది. దాదాపు మూడు నాలుగు నెలలుగా ఎన్నో విమర్శలు వాగ్వాదాలు మరెన్నో ఆరోపణలు దూషణల నడుమ జరిగిన ఎన్నికలకు నిన్న ఆదివారం తెరపడింది. అధ్యక్ష బరిలో దిగిన ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇరు ప్యానళ్ల మధ్య హోరాహోరీగా జరిగిన పోటీలో మంచు విష్ణు విజయపతాకం ఎగరేసి 'మా' అధ్యక్ష పదవిని చేపట్టారు. ఈ నేపథ్యంలో మంచు విష్ణు కు మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు  తెలిపారు.

'మా' నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు కి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ కి మిగతా విజేతల అందరికీ పేరు పేరునా అభినందనలు శుభాకాంక్షలు. మా నూతన కార్యవర్గం మూవీ ఆర్టిస్టులు అందరి సంక్షేమానికి పాటు పడుతుందని ఆశిస్తున్నాను. మా ఇప్పటికీ ఎప్పటికీ ఒకటే కుటుంబం. ఇందులో ఎవరు గెలిచినా మనసు కుటుంబం గెలిచినట్టే. ఆ స్పూర్తితోనే ముందుకు సాగుతామని నమ్ముతున్నాను'' అని చిరంజీవి ట్వీట్ లో పేర్కొన్నారు.

అంతకుముందు 'పెళ్లి సందD' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన చిరంజీవి మాట్లాడుతూ 'మా' ఎన్నికలను ఉద్దేశించి మాట్లాడారు. ''వెంకటేష్ నా చిరకాల మిత్రుడు. తన సినిమా బాగుంటే నేను.. నా సినిమా నచ్చితే తను ఒకరినొకరం అభినందించుకుంటాం. ఇది చాలా హెల్తీగా ఉంటుంది. అందరి హీరోల మధ్య ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే.. ఇలాంటి వివాదాలు.. కొట్టుకోవడాలు.. మాటలు అనడం.. అనిపించుకోవడం.. లాంటివి ఉండవు కదా?. ఏదైనా తాత్కాలికమే. ముఖ్యంగా పదవులు.. చిన్న చిన్న బాధ్యతలు లాంటివి రెండేళ్ళుంటాయా మూడేళ్ళుంటాయా నాలుగేళ్ళుంటాయా? ఒక పదవి కోసం మనం ఒకరినొకరం అనుకొని బయటి వాళ్లకు లోకువ కావాలా? అది నాకు బాధ అనిపిస్తుంది'' అని అన్నారు.

''ఎవరైనా కావొచ్చు. ఏ ఒక్కరినో నేను వేలు పెట్టి చూపించడం లేదు. ప్రతీ ఒక్కరు విజ్ఞతతో మెచ్యూరిటీతో మెలగాలి. మన ఆధిపత్యం ప్రభావం చూపించుకోవడానికి అవతలి వాళ్లను కించపరచాల్సిన అవసరం లేదు. అసలు వివాదం ఎక్కడ స్టార్ట్ అయిందో గుర్తుంచుకొని.. ఆ మనిషి ఎవరు? ఎవరి మూలంగా ఈ మధ్య కాలంలో వివాదాలు మొదలయ్యాయి? అనేది గుర్తించి హోమియోపతి వైద్యం చేయాలి. హోమియోపతిలో మూలలని గుర్తించి చికిత్స చేస్తారు. అలానే మనలో ప్రతి ఒక్కరు కూడా మూలల్లోకి వెళ్లి ఆలోచించాలి. దీనంతటికి కారణం ఎవరు అని తెలుసుకొని.. అలాంటి వ్యక్తుల్ని దూరం పెట్టగలిగితే చాలు. అప్పుడు మనది వసుధైక కుటుంబం. అందరూ ఆప్యాయంగా ఆత్మీయంగా హాయిగా ఉండాలి. చిన్న చిన్న గొడవల తోటి మీడియా వారికి లోకువై మనం వారికి ఆహారం అవ్వకూడదు. ప్లీజ్'' అని చిరంజీవి ఈ సందర్భంగా మాట్లాడారు.

చిరంజీవి స్పీచ్ కు అన్ని వైపుల నుంచి మద్దతు లభిస్తోంది. అదే సమయంలో చిరు చెప్పినట్లు దూరం పెట్టాల్సిన వ్యక్తులు ఎవరనే విషయం మీద నెటిజన్స్ స్పందిస్తున్నారు. 'మా' వివాదం పెద్దది కావడానికి మెగా బ్రదర్ నాగబాబు కూడా ఒక కారణమే కదా అని కామెంట్స్ పెడుతున్నారు. ఎన్నికల బరిలో దిగిన రెండు ప్యానల్స్ మధ్య వివాదాన్ని చల్లార్చాల్సింది పోయి.. వాటికి ఆజ్యం పోసేలా నాగబాబు ప్రెస్ మీట్స్ ఉన్నాయని అంటున్నారు. ప్రకాష్ రాజ్ అధ్యకుడిగా ఓడిపోతే నాగబాబు 'మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' సభ్యత్వానికి రాజీనామా చేయడం చూస్తుంటేనే మెగా బ్రదర్ వైఖరి ఏంటో తెలుస్తోందని నెటిజన్స్ వ్యాఖ్యానిస్తున్నారు.

Source: https://www.tupaki.com/movienews/article/Chiranjeevi-Sensational-Comments/305770

Leave Your Comment