logo

header-ad
header-ad

ఆ విషయంలో పవన్ మాట్లాడడం కరెక్ట్ అనిపిస్తోంది- మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి, తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సోమవారం హైదరాబాద్ నగరంలో జరిగిన చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న చిరు మాట్లాడుతూ” కొంతమంది అవసరం వచ్చినప్పుడు తమ బుద్ధిని చూపిస్తారు.. కానీ, నేను ఎదుటువారి మంచి కోరుకొనేవాడిని.. ఈ సేవా కార్యక్రమాలు మొదలుపెట్టినప్పుడు నా అభిమానులకు నేను ఒకటే చెప్పాను. నేను ఇచ్చిన పిలుపు మేరకు అభిమానులు ముందుకు వచ్చారంటే, నా స్పందన వారిలో వ్యక్తమైనట్టుగా భావిస్తాను.

మన చిత్తశుద్ధి, నిజాయితీ సంయమనం విజయాలను అందిస్తాయి. ఇక కళ్యాణ్ బాబు ఏ విషయం మీద మాట్లాడినా తన స్పందన సబబుగానే ఉంటుంది. కొన్ని అంశాల్లో పవన్ కల్యాణ్ స్పందించడం చూస్తుంటే సమంజసంగానే అనిపిస్తూ ఉంటుంది. పవన్ న్యాయం కోసమే మాట్లాడతాడు. న్యాయం కోసమే వాదిస్తాడు. నేను న్యాయం కోసమే మాట్లాడతాను. కానీ, పవన్ త్వరగా స్పందిస్తాడు.. నేను కొంచెం సమయం తీసుకొంటాను” తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Source: https://ntvtelugu.com/chiranjeevi-says-sometimes-pawan-kalyan-attitude-was-correct/

Leave Your Comment