logo

header-ad
header-ad

'రంగ్ దే'ని బీట్ చేసిన 'చెక్'

హిట్ టాక్ తెచ్చుకున్న 'రంగ్ దే' మూవిని ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న 'చెక్' బీట్ చేసి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ రెండు సినిమాలు యూత్‌స్టార్ నితిన్ నటిచినవి కావడం విశేషం. టాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించిన 'చెక్'లో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్‌గా నటించారు. భారీ అంచనాల మధ్య ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చి నిరాశపరచింది. అయితే, ఇటీవల 'చెక్' టెలివిజన్‌లో ప్రీమియర్ కాగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. బుల్లితెరపై ఏకంగా 8.53 టిఆర్‌పిని నమోదు చేసింది. కానీ హిట్ టాక్ తెచ్చుకున్న 'రంగ్ దే'కి మాత్రం 7.22 టిఆర్పి మాత్రమే రికార్డ్ అయ్యి షాకిచ్చింది. వెంకి అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. సిల్వర్ స్క్రీన్ మీద బాగానే 'రంగ్ దే' ఆకట్టుకుంది. దాంతో బుల్లితెరమీద మంచి రేటింగ్ సాధిస్తుందనుకుంటే సీన్ రివర్స్ అయింది.  

Source: https://chitrajyothy.com/telugunews/check-beats-rang-de-chj-grk-1921072412174160

Leave Your Comment