logo

header-ad
header-ad

Aakash Chopra: కుల్దీప్ యాదవ్, చాహల్ ఇద్దరూ మూడు వన్డేలు ఆడాలి

న్యూఢిల్లీ: శ్రీలంక పర్యటనలో యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ ఇద్దరూ మూడు వన్డేలూ ఆడాలని టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. స్పిన్ ద్వయానికి ఇంతకుమించిన అవకాశం దొరకదని భావిస్తున్నట్టు చెప్పాడు. 

 2019 ప్రపంచకప్ లీగ్‌లో ఇంగ్లండ్‌తో బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిన తర్వాత కుల్దీప్, చాహల్ ఇద్దరూ ఆ తర్వాత కనిపించలేదని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయనప్పుడు జట్టు ఆల్‌రౌండర్ కోసం చూపిందని, కానీ ఇప్పుడు అతడు బౌలింగ్ కూడా చేస్తున్నాడని అన్నాడు.

జడేజా, అశ్విన్‌లు వన్డే జట్టులో లేకపోవడంతో వీరిద్దరినీ ఆడించాలని కోరాడు. వారిని వందశాతం మూడు వన్డేలలో ఆడించాలని, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలని సూచించాడు. చాహల్, యాదవ్‌ను ఆడించేందుకు శ్రీలంక సిరీస్‌కు మించిన మంచి అవకాశం దొరకదని చోప్రా అభిప్రాయపడ్డాడు. 

Source: https://andhrajyothy.com/telugunews/chahal-and-kuldeep-must-play-all-three-odis-in-sri-lanka-1921071707562721

Leave Your Comment