logo

header-ad
header-ad

కాసేపట్లో రెడ్‌మీ నోట్ 9 సేల్..

redmi note 9 : 

1. కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. అమెజాన్‌లో కాసేపట్లో రెడ్‌మీ నోట్ 9 సేల్ జరగనుంది.

2. షావోమీ కొద్ది రోజుల క్రితం రెడ్‌మీ నోట్ 9 రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. రూ.12,000 లోపు బడ్జెట్‌లో ఈ ఫోన్‌ను పరిచయం చేసింది.

3. రెడ్‌మీ నోట్ 9 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ, 4జీబీ+128జీబీ, 6జీబీ+128జీబీ వేరియంట్లలో లభిస్తుంది. ప్రారంభ ధర రూ.11,999 మాత్రమే. 

4. రెడ్‌మీ నోట్ 9 స్మార్ట్‌ఫోన్‌లో 5,020ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ లాంటి ప్రత్యేకతలున్నాయి. 

5. రెడ్‌మీ నోట్ 9 స్పెసిఫికేషన్స్ చూస్తే 6.53 అంగుళాలో ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

6. రెడ్‌మీ నోట్ 9 రియర్ కెమెరా 48+8+2+2 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 13 మెగాపిక్సెల్. 

7. రెడ్‌మీ నోట్ 9 స్మార్ట్‌ఫోన్‌లో 5,020ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఆండ్రాయిడ్ 10+ఎంఐయూఐ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 

8. రెడ్‌మీ నోట్ 9 స్మార్ట్‌ఫోన్ ఆక్వా గ్రీన్, పెబ్బెల్ గ్రే, అర్క్టిక్ వైట్ కలర్స్‌లో లభిస్తుంది.

9. రెడ్‌మీ నోట్ 9 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.11,999 కాగా, 4జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.13,499. ఇక హైఎండ్ వేరియంట్ 6జీబీ+128జీబీ ధర రూ.14,999.

10. రెడ్‌మీ నోట్ 9 స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 5 శాతం వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. 

Source: https://telugu.news18.com/photogallery/technology/buy-redmi-note-9-today-on-amazon-with-up-to-5-percent-cash-back-on-amazon-pay-icici-bank-credit-card-ss-594776-page-10.html

Leave Your Comment