logo

header-ad
header-ad

రికార్డు హైకి చేరిన సెన్సెక్స్‌

ముంబై : కొనుగోళ్ల జోరుతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ సరికొత్త శిఖరాలను తాకింది. నిర్మాణ రంగానికి ఊతమిచ్చేలా కేంద్రం, ఆర్బీఐలు చర్యలు చేపడతాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన ప్రకటనతో రియల్‌ఎస్టేట్‌ షేర్లు పరుగులు పెట్టాయి. రియల్టీ షేర్లు ఇండియా బుల్స్‌, శోభా, ప్రెస్టిజ్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్సు షేర్లు 5 శాతం వరకూ లాభపడ్డాయి. మొత్తంమీద బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 256 పాయింట్ల లాభంతో 40,504 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 62.50 పాయింట్లు పెరిగి 11,979 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

Source: https://www.sakshi.com/news/business/sensex-hits-fresh-record-high-1237997

Leave Your Comment