logo

header-ad
header-ad

బిగ్ బాస్ టైటిల్ పోరు వారిద్దరి మధ్యలోనే…!

ఇంకా కేవలం ఒక్కరోజులో బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 విన్నర్ ఎవరు అనేది తెలిసిపోతుంది. హౌస్ లో టాప్ ఫైవ్ లో నిలిచిన రాహుల్, వరుణ్, శ్రీముఖి,బాబా భాస్కర్,అలీ రెజాలలో ఒకరు టైటిల్ తో పాటు 50లక్షల ఫ్రైజ్ మనీ ఎగరేసుకుపోనున్నారు. 100రోజులకు పైగా జరిగిన ఈ రియాలిటీ షోలో చివరి అంకం వరకు, టైటిల్ పోరు వరకు చేరడానికి సభ్యులు చాలా కష్టాలు పడ్డారు. శారీకమైన, మానసికమైన ఒత్తిడిని అనుభవించారు. ఎలాగైతేనేమి అన్ని ఆటంకాలు ఎదుర్కొని వీరి చివరి దశకు చేరుకున్నారు.

కాగా నిన్నటితో ఓటింగ్ ప్రక్రియ కూడా ముగిసింది. తమతమ అభిమాన కంటెస్టెంట్ ని గెలిపించుకోవడానికి ప్రేక్షకులు ఓట్లు వేయడం జరిగింది. ఉన్న ఐదుగురు సభ్యులలో అత్యధిక ప్రేక్షక అభిమానం చూరగొని అధిక ఓట్లు సంపాదించిన వారు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిలుస్తారు. ఐతే తాజా ట్రెండింగ్ చూస్తుంటే టాప్ టూ లోకి చేరేది రాహుల్, శ్రీముఖి అని తెలుస్తుంది. ఐదుగురిలో వీరిద్దరే మిగిలిన వారికంటే ఎక్కువ ఓట్లు సంపాదించుకున్నారని టాక్. వరుణ్, బాబా భాస్కర్ కూడా రేస్ లో లేరని తెలుస్తుంది. టైటిల్ పోరులో రాహుల్, శ్రీముఖి మొదటి స్థానంలో నిలువగా వీరిద్దరిలో ఒకరు టైటిల్ గెలవనున్నారట.

Source: https://www.123telugu.com/telugu/news/these-two-contestants-have-maximum-chances-of-wining-of-big-boss-title.html

Leave Your Comment