బిగ్ బాస్ - 3 సీజన్ ఫైనల్ ఇవాళ ప్రసారం కానుంది.. దాంట్లో టైటిల్ గెలిచేది ఎవరు? విన్నర్‌గా సరిపెట్టుకునేది ఎవరు? తేలిపోనుంది. అయితే.. విన్నర్‌ను ప్రకటించేశారు.. గెలిచిందే రాహుల్ సిప్లిగంజ్.. రన్నర్‌గా శ్రీముఖి నిలిచింది.. తర్వాత రాహుల్ సంబరాల్లో కూడా పాల్గొన్నాడు.. సంబరాలకు సంబంధించిన ఫొటోలు ఇవే.. ఇలా రకరాల పుకార్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.. శనివారం మధ్యాహ్నం నుంచే ఈ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇది కాస్త బిగ్‌బాస్‌కు తలనొప్పిగా మారింది.. దీంతో బిగ్‌బాస్ సీజన్ 3కి హోస్ట్‌గా ఉన్న అక్కినేని నాగార్జున రంగంలోకి దిగాడు. అసలు విషయం ఏంటో క్లారిటీ ఇచ్చారు.
బిగ్‌బాస్ 3 సీజన్ విన్నర్‌పై సోషల్ మీడియా వేదికగా స్పందించిన అక్కినేని నాగార్జున.. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అబద్ధమని కొట్టి పారేసారు. అసలు విజేత ఎవరో తాను చెప్తానని.. అది కూడా బిగ్‌బాస్ లైవ్ స్ట్రీమింగ్ అంటూ ట్వీట్ చేశారు. దాంతో ఇప్పటి వరకు సోషల్ మీడియాలో పుకార్లను వైరల్ చేసిన వారికి షాక్ తగిలింది. అసలు బిగ్‌బాస్ 3 సీజన్ విన్నర్ రాహులేనా? లేక శ్రీముఖియా? లేకపోతే హౌస్‌లో ఉన్న మరొకరా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. అంతే కాదు.. ఫైనల్ ఎపిసోడ్ ఇంకా షూట్ చేయలేదని.. అది లైవ్ జరుగుతుందని క్లారిటీ ఇచ్చారు టాలీవుడ్ మన్మథుడు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా బిగ్‌బాస్ 3 విన్నర్‌కు ట్రోఫీ అందజేస్తామని చెప్పుకొచ్చారు నాగార్జున.. మొత్తానికి ఇప్పుడు నాగార్జున చేసిన ట్వీట్ కొత్త చర్చకు తెరలేపారు. అసలు విజేత ఎవరూ తెలియాలంటే మాత్రం రాత్రి వరకు ఆగాల్సిందే మరి..