చాయ్ ప్రియులు సాధారణంగా రోజుకు 5 కప్పుల కన్నా ఎక్కువగానే చాయ్ తాగుతుంటారు. అయితే చాయ్ తాగినప్పుడల్లా అందులో ఉండే చక్కెర శరీరంలోకి వెళ్లి అధికంగా క్యాలరీలు చేరేలా చేస్తుంది. దీంతో బరువు అధికంగా పెరుగుతారు. అయితే టీలో చక్కెరకు బదులుగా బెల్లంను చేర్చుకుంటే అధిక బరువు ముప్పు నుంచి తప్పించుకోవడంతోపాటు పలు ఆరోగ్యకర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
* మలబద్దకంతో బాధపడేవారికి బెల్లం ఎంతో మేలు చేస్తుంది. టీలో బెల్లంను చేర్చడం వల్ల జీర్ణ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. జీర్ణ ప్రక్రియ వేగంగా జరుగుతుంది.
* బెల్లంలో ఉండే ఐరన్‌తో రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. దీంతోపాటు శరీరంలోని అవయవాలకు రక్త సరఫరా పెరుగుతుంది.
* టీలో బెల్లంతోపాటు కొద్దిగా అల్లంను కూడా చేర్చుకుంటే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు, అలర్జీలు తగ్గుతాయి.
* బెల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో ఏర్పడే ఫ్రీ ర్యాడికల్స్ చేసే నష్టాన్ని తగ్గిస్తాయి.