logo

header-ad
header-ad

సరికొత్త టెక్నాలజీతో అసుస్‌ ల్యాప్‌టాప్స్ ...

ముంబై :తైవాన్‌కు చెందిన సుప్రసిద్ధ ఎలక్ట్రానిక్స్‌ సంస్థ అసుస్‌ తాజా శ్రేణి ఇంటెల్‌ పవర్ ఫుల్ ల్యాప్‌టాప్‌లను ఆవిష్కరిస్తున్నట్లు వెల్లడించింది. వీటిలో వివో బుక్‌ అల్ట్రా 14/15 (ఎక్స్‌413/ఎక్స్‌513), వివోబుక్‌ ‌ అల్ట్రాకె15(కె513) , జెన్‌బుక్‌ 14(యుఎక్స్‌ 425) ఉన్నాయి. వినియోగదారుల అభిరుచికి తగిన నాణ్యత తో తమ నిబద్ధతకు అనుగుణంగా అసుస్‌ ఇప్పుడు జెన్‌ జెడ్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అత్యంత ఖచ్చితత్త్వంతో కూడిన ఇంజినీరింగ్‌తో ఈ మొత్తం శ్రేణి ఉపకరణాలను రూపొందించింది. తాజా లెవెన్త్ జనరేషన్ ఇంటెల్‌ కోర్‌ ప్రాసెసర్లుతో కూడిన ఈ ‌అల్ట్రా స్లిమ్‌ డిజైన్‌, చూడగానే సంతృప్తి పరిచే అపీరెన్స్ , కస్టమ్‌ ఇంటిలిజెంట్‌ కూలింగ్‌ పరిష్కారాలు, వేగవంతమైన ర్యామ్‌, విస్తరించతగిన స్టోరేజీ, నానో ఎడ్జ్‌ డిస్‌ప్లేతో కూడిన ఈ అత్యంత శక్తివంతమైన ల్యాప్‌టాప్‌లు మెరుగైన పనితీరు, లీనమయ్యే విజువల్స్‌, ఎదురులైని పనితీరు అందిస్తాయి.

" వివో బుక్‌ అల్ట్రా , జెన్‌ బుక్‌ సిరీస్‌లో తాజా ప్రవేశంతో, అత్యంత శక్తివంతమైన పనితీరును అందించాలన్నది మా లక్ష్యం, దీనితో పాటుగా లీనమయ్యే విజువల్స్‌ , మా వినియోగదారుల కోసం ఉత్సాహపూరితమైన ఫీచర్లతో కూడిన అప్‌గ్రేడ్స్‌ను సైతం అందించనున్నాం. మెరుగైన పోర్టబిలిటీ కోసం అత్యున్నత హార్డ్‌వేర్‌ డిజైన్‌ మొదలు, అతి సరళమైన , భారీ కార్యకలపాలను సైతం సులభంగా చేయడానికి తగినట్లుగా ప్రాసెసింగ్‌ శక్తి వంటివన్నీకూడా ఈ ల్యాప్‌టాప్‌లలో ఉంటాయని" అసుస్‌ ఇండియా కన్స్యూమర్‌ అండ్‌ గేమింగ్‌ పీసీ, సిస్టమ్‌ బిజినెస్‌ గ్రూప్‌, బిజినెస్‌ హెడ్ అర్నాల్డ్‌ సు తెలిపారు .

Source: https://www.ntnews.com/science-technology/asus-ramps-up-its-consumer-laptop-line-up-with-ultra-powerful-11th-gen-intel-core-processors-99645

Leave Your Comment