న్యూఢిల్లీ: అశోక్ లేలాండ్.. మార్కెట్లోకి తేలిక పాటి వాణిజ్య వాహన (ఎల్‌సీవీ) శ్రేణిలో సరికొత్త వాహనం ‘బడా దోస్త్’ ను విడుదల చేసింది. కొత్త ప్లాట్‌ఫామ్‌పై తీసుకువచ్చిన తొలి ఉత్పత్తి ఇదని పేర్కొంది. ఐ4, ఐ3 వేరియంట్లలో బీఎస్-6 ఇంజన్‌తో ఈ బడా దోస్త్‌ను తీసుకువచ్చినట్లు తెలిపింది.
1,860, 1,405 కేజీల పేలోడ్ సామర్థ్యం గల ఐ4 వేరియంట్స్ ధరలు రూ.7.79 లక్షలు, రూ.7.99 లక్షలుగా ఉన్నాయి. కాగా ఐ3 వేరియంట్ ధరలు రూ.7.75 లక్షలు, రూ.7.95 లక్షలు (ముంబై ఎక్స్‌షోరూమ్)గా ఉన్నాయి. కొత్త ప్లాట్‌ఫామ్ అభివృద్ధి, మాన్యుఫ్యాక్చరింగ్ కార్యకలాపాల కోసం రూ.350 కోట్లను పెట్టుబడిగా పెట్టినట్లు అశోక్ లేలాండ్ తెలిపింది.
ప్రపంచ మార్కెట్లలో బడా దోస్త్‌ను విక్రయించేందుకు వీలుగా లెఫ్ట్, రైట్ హ్యాండ్ డ్రైవింగ్ ఆప్షన్లతో రూపొందించినట్లు పేర్కొంది.