logo

header-ad
header-ad

రవితేజకు జోడీగా...

రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. శరత్‌ మండవ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ‘మజిలీ’ ఫేమ్‌ దివ్యాంశా కౌశిక్‌ ఓ హీరోయిన్‌. మరో కథానాయికగా రజిషా విజయన్‌ను ఎంపిక చేశారు. తమిళంలో ధనుష్‌కు జంటగా ‘కర్ణన్‌’లో నటించారీమె. హైదరాబాద్‌లో జరుగుతున్న చిత్రీకరణలో ఇద్దరు కథానాయికలు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా చిత్రనిర్మాత సుధాకర్‌ చెరుకూరి మాట్లాడుతూ ‘‘వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న థ్రిల్లర్‌ చిత్రమిది. చాలా విభిన్నంగా ఉంటుంది. కొన్ని రోజులుగా రవితేజ, రజిషా, దివ్యాంశలపై దర్శకుడు శరత్‌ మండవ కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు’’ అని చెప్పారు. నాజర్‌, సీనియర్‌ నరేశ్‌, పవిత్రా లోకేశ్‌, రాహుల్‌ రామకృష్ణ నటిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్‌ సీఎస్‌ సంగీత దర్శకుడు.

Source: https://chitrajyothy.com/telugunews/as-a-partner-to-ravi-teja-1921072003162537

Leave Your Comment