logo

header-ad
header-ad

Tokyo Olympics: అదరగొట్టిన అతాను దాస్.. ఒలింపిక్స్ స్వర్ణపతక విజేతకు షాక్!

టోక్యో: ఒలింపిక్స్ పురుషుల ఆర్చరీలో భారత టాప్ ఆర్చర్ అతాను దాస్‌ అదరగొట్టాడు. గురువారం పురుషుల వ్యక్తిగత విభాగంలో జరిగిన 1/16 ఎలిమినేషన్‌ రౌండ్‌లో ఆయన  కొరియన్ ఆర్చర్‌ జిన్‌హెక్‌పై 6-5 తేడాతో సంచలన విజయం సాధించారు. దీంతో అతాను ప్రీక్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. జిన్‌ హెక్‌ 2012 లండన్‌ ఒలిపింక్స్‌లో గోల్డ్‌మెడలిస్ట్‌ కావడం విశేషం. అంతకుముందు అతాను దాస్ 1/32 ఎలిమినేషన్ రౌండ్‌లో చైనీస్‌ తైపీకి చెందిన యూ చెంగ్‌ డెంగ్‌పై 6-4 తేడాతో ఘన విజయం సాధించాడు. మరోవైపు ఒలింపిక్స్ ఆరో రోజు భారత్‌కు బాగానే కలిసి వచ్చింది. ఇవాళ పీవీ సింధు, పురుషుల హాకీ జట్టు మంచి విజయాలతో ముందంజ వేయగా.. ఇప్పుడు అర్చరీలో అతాను దాస్ ప్రీక్వార్టర్స్ చేరడంతో భారత్‌ మరిన్ని పతకాలకు చేరువవుతుందనే చెప్పాలి.  

Source: https://andhrajyothy.com/telugunews/archer-atanu-das-beats-olympic-gold-medallist-1921072909325334

Leave Your Comment