logo

header-ad
header-ad

సాలీడ్‌ భయాన్ని పొగొట్టే యాప్‌ ఇది! అచ్చం పురుగుల్లాగే..

స్విట్జర్లాండ్‌ బాసెల్‌ యూనివర్సిటీ రీసెర్చర్లు ‘డబ్బ్‌డ్‌ ఫోబిస్‌’ పేరుతో ఓ కొత్త యాప్‌ను డెవలప్‌ చేశారు. ఇందులో అగ్‌మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీతో రూపొందించిన సాలీడు పురుగుల బొమ్మలు డిస్‌ప్లే అవుతాయి. వీటి ద్వారా నిజమైన సాలీడు పురుగుల వల్ల కలిగే భయాన్ని దూరం చేసుకోవచ్చని రీసెర్చర్లు చెప్తున్నారు.

సాలీడు పురుగుల వల్ల మనిషికి కలిగే భయాన్ని అరాచ్నోఫోబియా(అరాక్నోఫోబియా) అంటారు. దీని నుంచి బయటపడేందుకు చాలామంది మానసిక వైద్యులు, థెరపిస్టుల చుట్టూ తిరుగుతూ డబ్బు ఖర్చు చేస్తుంటారు. అయితే డబ్బ్‌డ్‌ ఫోబిస్‌ పూర్తిగా ఫ్రీ యాప్‌.  అగుమెంటెడ్‌ రియాలిటీ 3డీ స్పైడర్‌ బొమ్మల వల్ల.. రియల్‌ లైఫ్‌ స్పైడర్‌లు ఎదురైనప్పుడు కలిగే భయాన్ని ఫేస్‌ చేయొచ్చు.

మొత్తం పది లెవల్స్‌లో  ఈ యాప్‌ ట్రీట్‌మెంట్‌(సెల్ఫ్‌) చేసుకోవచ్చు.  రీసెంట్‌గా ఈ యాప్‌ వల్ల అరాచ్నోఫోబియా బయటపడ్డ కొందరి అభిప్రాయాల్ని ‘యాంగ్జైటీ డిజార్డర్స్‌’ అనే జర్నల్‌లో పబ్లిష్‌ చేశారు. వీళ్లంతా సుమారు రెండువారాలపాటు ఆరున్నర గంటలపాటు శిక్షణ తీసుకున్నారు.  సంప్రదాయ పద్ధతిలో థెరపీ కంటే మెరుగైన ఫలితాలను ఇచ్చాయని రీసెర్చర్లు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ప్లేస్టోర్‌లో డమ్మీ ఫోబిస్‌ యాప్‌లు చాలానే ఉన్నాయి. కానీ, ఏఆర్‌ టెక్నాలజీ ఎక్స్‌పీరియన్స్‌తో కూడిన డబ్బ్‌డ్‌ ఫోబిస్‌ యాప్‌ రావడానికి కొంత టైం పడుతుందని చెప్తున్నారు.

Source: https://www.sakshi.com/telugu-news/business/ar-mobile-app-overcome-spiders-fear-1399006

Leave Your Comment