logo

header-ad
header-ad

సింగపూర్‌లో తేలియాడే స్టోర్‌ను ప్రారంభిస్తున్న యాపిల్

సింగపూర్: ఎలక్ట్రానిక్ దిగ్గజం యాపిల్ సింగపూర్‌లో ఈ నెల 10 తేలియాడే స్టోర్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. సింగపూర్ మెరీనా బేలో నిర్మించిన ఈ యాపిల్ స్టోర్‌ను గ్లాస్ డోమ్‌తో అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. యాపిల్‌కు సింగపూర్‌లో ఇది మూడో స్టోర్ కాగా, ప్రపంచవ్యాప్తంగా 512వది.

ఈ తేలియాడే స్టోర్‌కు సంబంధించిన ఫొటోలను యాపిల్ షేర్ చేసింది. స్టోర్‌లోపల ఇంటీరియర్‌ను అత్యద్భుతంగా డిజైన్ చేశారు. గురువారం నుంచి ఈ స్టోర్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. 

ఈ తేలియాడే స్టోర్‌ను యాపిల్ మెరీనా బే శాండ్స్‌గా పిలుస్తున్నారు. పెద్ద ఎత్తున షాపులు, రెస్టారెంట్లు, మెరినా బే శాండ్స్ హోటల్ అండ్ కేసినా ఉన్న సింగపూర్ లగ్జరీ జిల్లాలో యాపిల్ స్టోర్ కొలువు దీరింది. గోళంలా ఉన్న దీనిని 114 వేర్వేరు గాజు ముక్కలతో రూపొందించారు.

అలాగే, పది నిలువు సపోర్టింగ్ బార్‌లు (ఆర్కిటెక్చర్ పరిభాషలో వీటిని ముల్లియన్లుగా వ్యవహరిస్తారు) ఏర్పాటు చేశారు. ఈ స్టోర్‌లోని 148 మంది సభ్యుల బృందం 23 భాషలను మాట్లాడగలడం మరో విశేషం. 

Source: https://www.andhrajyothy.com/telugunews/apple-shares-a-look-inside-its-first-ever-floating-store-202009080610403

Leave Your Comment