logo

header-ad
header-ad

యాపిల్‌ నుంచి తొలిసారి హెడ్‌ఫోన్స్‌

  • ఎయిర్‌పోడ్స్‌ మ్యాక్స్‌ పేరుతో దేశీయంగా విడుదల
  • ఆన్‌ఇయర్‌ వైర్‌లెస్‌ హెడ్‌ఫోన్స్‌ విక్రయాలు షురూ
  • దేశీయంగా ధర రూ. 59,900
  • యాపిల్‌ వెబ్‌సైట్‌, అధీకృత విక్రేతల ద్వారా అందుబాటు

ముంబై : గ్లోబల్‌ టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌ ఇంక్‌ తొలిసారి ఆన్‌ఇయర్‌ వైర్‌లెస్‌ హెడ్‌ఫోన్స్‌ను ప్రపంచ మార్కెట్లలో ప్రవేశపెట్టింది. దేశీయంగానూ యాపిల్‌ వెబ్‌సైట్‌, ఆధీకృత రిటైలర్ల ద్వారా వీటిని విక్రయించనుంది. స్థానికంగా వీటి ధర రూ. 59,900గా ప్రకటించింది. ఈ నెల 15 నుంచి వీటిని సరఫరా చేయనున్నట్లు తెలియజేసింది. తాజా అమ్మకాలలో భాగంగా 25 దేశాలు, ప్రాంతాలకు వీటిని అందించనున్నట్లు వెల్లడించింది. ఐప్యాడ్లు తదితర యాపిల్‌ డివైస్‌లు ఐవోఎస్‌ 14.3 లేదా తదుపరి అప్‌గ్రేడ్‌తో పనిచేస్తాయని ఐఫోన్ల దిగ్గజం యాపిల్‌ పేర్కొంది. మ్యాక్‌ ఓఎస్‌ బిగ్‌ 11.1 లేదా తదుపరి అప్‌గ్రేడ్స్‌ ద్వారా వీటిని వినియోగించుకోవచ్చని వివరించింది. యాపిల్‌ వాచీలయితే ఓఎస్‌ 7.2, టీవీలకు ఓఎస్‌14.3 కంపాటిబుల్‌గా పేర్కొంది.

హెచ్‌1 చిప్‌

ప్రపంచవ్యాప్తంగా హెడ్‌ఫోన్స్‌లో ఎయిర్‌పోడ్స్‌ జనాదరణ పొందినట్లు యాపిల్‌ సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌ గ్రెగ్‌ జాస్వియక్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎయిర్‌పోడ్స్‌ మ్యాక్స్‌ ద్వారా అత్యంత నాణ్యతమైన ఆడియో ఎక్స్‌పీరియన్స్‌ను పొందవచ్చని తెలియజేశారు. ఆధునిక డిజైన్‌, ప్రతిభావంతమైన హెచ్‌1 చిప్‌, అడ్వాన్స్‌డ్‌ సాఫ్ట్‌వేర్‌ తదితరాల కారణంగా వినియోగదారులు అత్యుత్తమ వైర్‌లెస్‌ ఆడియోను ఆనందించవచ్చని వివరించారు. ఎడాప్టివ్‌ ఈక్విలైజర్‌ కలిగి ఉన్నట్లు తెలియజేశారు. మూడు మైక్రోఫోన్ల ద్వారా అనవసర శబ్దాలను తగ్గిస్తుందని(నాయిస్‌ రిడక్షన్‌) పేర్కొన్నారు. కానీ దీని ధరపై కొంత మంది నిపుణులతో పాటు, ఆపిల్ లవర్స్ కూడా పెదవి విరుస్తున్నారు.

Source: https://www.sakshi.com/telugu-news/business/apple-launches-air-wireless-head-phones-1332023

Leave Your Comment