logo

header-ad
header-ad

ఐఫోన్ 11 ఫోన్ల ఉత్పత్తిని పెంచిన ఆపిల్..!

సాఫ్ట్‌వేర్ సంస్థ ఆపిల్ తన నూతన ఐఫోన్లు.. ఐఫోన్ 11, 11ప్రొ, 11 ప్రొ మ్యాక్స్‌లను గత నెలలో విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్లలో ఐఫోన్ 11కు మాత్రమే భారత్‌లో పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తున్నది. దీంతో ఆపిల్ ఐఫోన్ 11 ఫోన్ల ఉత్పత్తిని పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే తయారీదార్లకు ఆపిల్ ఐఫోన్ 11 ఫోన్లను మరో 10 శాతం (దాదాపుగా 8 మిలియన్ యూనిట్లు) వరకు అదనంగా ఉత్పత్తి చేయాలని ఆర్డర్లు ఇచ్చింది. కాగా భారత్‌లో ఐఫోన్ 11పై ఆకట్టుకునే డిస్కౌంట్లను, ఆఫర్లను అందిస్తుండడంతోపాటు ఈ ఫోన్ మిగిలిన రెండు ఐఫోన్ల కన్నా తక్కువ ధర ఉండడంతో దీన్ని కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని, అందుకనే భారత్‌లో ఐఫోన్ 11కు డిమాండ్ బాగా ఏర్పడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Source: https://www.ntnews.com/technology/apple-increased-iphone-11-production-by-up-to-10-percent-1-1-10607123.html

Leave Your Comment