ఆయుర్వేదాన్ని ఆయుర్వేద ప్రొడక్ట్స్ ని ప్రపంచ వ్యాప్తం చేయడానికి అమెజాన్ ఒక ప్రత్యేక వెబ్ సైట్ ని ఓపెన్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. భారతీయ ఆయుర్వేద తయారీదారుల కోసం ఇది ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నట్టు సమాచారం. కేరళలోని కొచ్చిలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నిన్న నిర్వహించిన గ్లోబల్ ఆయుర్వేద మీట్ 2019 లో ఒక సెషన్‌కు హాజరైన అమెజాన్ ఇండియా, గ్లోబల్ సెల్లింగ్ హెడ్ రచిత్ జైన్ మాట్లాడుతూ ఈ సైట్ ఆయుర్వేద ఉత్పత్తిదారులకు మరిన్ని అవకాశాలు అందిస్తుందని అన్నారు.
అలాగే హెర్బల్, బ్యూటీ ప్రొడక్ట్స్ అనేవి ఆమెజాన్ లో అతి ముఖ్యమైనవని పేర్కొన్నారు. భారతదేశం నుండి అమెజాన్లోనే ఆయుర్వేదానికి సంబంధించి 50,000కి పైగా గ్లోబల్ సెల్లర్స్ ఉన్నారని వారందిరికీ ఇది ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఆన్ లైన్ లో రిజిస్టర్ కావాలిసిన వారు అవి విక్రయించబడే దేశాలలో నిబంధనలకు లోబడి ఉండాలని పేర్కొన్నారు. అమెజాన్‌లో విక్రయించాలనుకునే తయారీదారులు సైట్‌లో నాణ్యమైన ఉత్పత్తులు మాత్రమే ఎంపిక చేయబడతాయని, ఇక దాని కోసం పూర్తి వివరాలను సమర్పించాల్సి ఉంటుందని జైన్ పేర్కొన్నారు.