logo

header-ad
header-ad

ఐఫోన్ 11 స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్...

iPhone 11 offer | ఐఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఐఫోన్ 11 స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది అమెజాన్. అయితే ఈ ఆఫర్ ఒక రోజు మాత్రమే. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.

1. మీరు లేటెస్ట్ ఐఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ ఆఫర్ మీకోసమే. అమెజాన్‌లో డీల్ ఆఫ్ ది డేలో భాగంగా ఐఫోన్ 11 స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. సెప్టెంబర్ 8న అర్థరాత్రి వరకు ఈ డిస్కౌంట్ పొందొచ్చు. 

2. ఐఫోన్ 11 స్మార్ట్‌ఫోన్‌ను రూ.3013 నో కాస్ట్ ఈఎంఐతో కొనొచ్చు. అంతేకాదు... ఎక్స్‌ఛేంజ్‌లో ఈ ఫోన్ కొంటే రూ.18,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇక అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే ప్రైమ్ కస్టమర్లు 5 శాతం, నాన్ ప్రైమ్ కస్టమర్లు 3 శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు

3. ఐఫోన్ 11 రెగ్యులర్‌గా ఉండే ధర కన్నా రూ.3,000 తక్కువకే కొనొచ్చు. ఐఫోన్ 11 స్మార్ట్‌ఫోన్‌పై రూ.3,000 డిస్కౌంట్ ఈ రోజు మాత్రమే. 64జీబీ వేరియంట్ ధర రూ.63,999 కాగా, 128జీబీ వేరియంట్ ధర రూ.67,900. ఇక 256జీబీ ధర రూ.76,900. 

4. ఐఫోన్ 11 సిరీస్‌లో భాగంగా గతేడాది ఇండియాలో ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసింది యాపిల్. త్వరలో ఐఫోన్ 12 స్మార్ట్‌ఫోన్లు రానున్న సంగతి తెలిసిందే. 

5. ఇక ఐఫోన్ 11 స్పెసిఫికేషన్స్ చూస్తే 6.1 అంగుళాల లిక్విడ్ రెటీనా డిస్‌ప్లే ఉంది. యాపిల్ ఏ13 బయోనిక్ ప్రాసెసర్, ఐఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 

6. ఐఫోన్ 11 రియర్ కెమెరా 12+12 మెగాపిక్సెల్ కాగా ఫ్రంట్ కెమెరా: 12 మెగాపిక్సెల్. బ్యాటరీ 3,110 ఎంఏహెచ్.

7. ఐఫోన్ 11 స్మార్ట్‌ఫోన్‌ను 6 కలర్స్‌లో కొనొచ్చు. వైట్, పర్పుల్, గ్రీన్, యెల్లో, బ్లాక్, రెడ్ కలర్స్‌లో లభిస్తుంది. 

8. ప్రస్తుతం ఐఫోన్ 11 స్మార్ట్‌ఫోన్ 64 జీబీ వేరియంట్ ధర రూ.61,900 కాగా, 128జీబీ వేరియంట్ ధర రూ.67,900. ఇక హైఎండ్ వేరియంట్ 256జీబీ ధర రూ.76,900. 

Source: https://telugu.news18.com/photogallery/technology/amazon-deal-of-the-day-rs-3000-discount-on-apple-iphone-11-know-latest-price-and-specs-ss-599428.html

Leave Your Comment