బన్నీ-త్రివిక్రమ్ ల హ్యాట్రిక్ మూవీ అలవైకుంఠపురంలో షూటింగ్ చివరి దశకు చేరిందని సమాచారం. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ విడుదల చేస్తూ విడుదలకు రెండు నెలలకు ముందు నుండే సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. ఇక మిగిలిన పాటల చిత్రీకరణ కోసం అల వైకుంఠపురములో యూనిట్ యూరప్ వెళ్లింది . హీరో అల్లు అర్జున్, హీరోయిన్ పూజా హెగ్డే మధ్య ఓ మంచి రొమాంటిక్ సాంగ్ ను అక్కడ చిత్రీకరించనున్నారట. సినిమాకు సంబంధించి ఇప్పటివరకు రెండు పాటలు రిలీజ్ అయ్యాయి.
ఇప్పుడు ఓ పాట కోసం యూరోప్ వెళ్లారు. యూరోప్ నుంచి తిరిగొచ్చిన తర్వాత ఆ మేకింగ్ విజువల్స్ తో పాటు లిరికల్ వీడియోను రిలీజ్ చేయాలనేది ప్లాన్. మూడో పాట కూడా హిట్ అయితే, సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటినట్టే.హారిక హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్ర చేస్తుండగా, సుశాంత్, నివేదా పేతురాజ్ ఇతర ప్రాధాన్యం ఉన్న పాత్రలలో కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుండగా, ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.