logo

header-ad
header-ad

ఈ అలారంతో ఉదయం నిద్ర లేవాల్సిందే

మీరు పోద్దున లేవాలనుకున్న లేవలేక పోతున్నారా? ఒక వేళా లేసిన మళ్ళి నిద్రపోతున్నారా?. అయితే మీకు గుడ్ న్యూస్.. అలాంటి వాళ్ల కోసం ఒక యాప్ లాంచ్ అయింది. దాని పేరే ‘ఛాలెంజెస్​ అలారం క్లాక్– వేకప్​ పజిల్స్​’​ అనే అలారం యాప్. ఇది అన్ని అలారంల లాగా టైం రిమైండ్​ చేయదు ఈ యాప్​. ఒక వేళా అన్ని యాప్ లలాగే లేసి ఆఫ్​ చేసి పడుకుందామన్నా ఊరుకోదు. ఒకసారి ఈ యాప్​లో అలారం పెడితే మళ్ళి ఆఫ్​ చేయాలంటే గణిత, జ్ఞాపకశక్తి, సీక్వెన్స్, రీటైప్, పిక్చర్, స్మైల్ కు సంబందించిన ఒక పజిల్ ని సాల్వ్​ చేయాలి. దాంతో ఆటోమేటిక్​గా నిద్రమత్తు వదలడంతో పాటు మీ మెదడు కూడా బాగా పనిచేస్తుంది. కాకపోతే ఈ యాప్​లో అలారం సెట్​ చేయడానికి ముందే ఛాలెంజెస్​, గేమ్స్​ని సెలక్ట్​ చేసుకోవాలి. ఈ యాప్ విద్యార్థులకు, ఉద్యోగులకు బాగా పనిచేస్తుంది. దీనికోసం మీరు ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది మీకు గూగుల్​ ప్లేస్టోర్​ లో ఉచితంగా లభిస్తుంది.

Source: https://www.sakshi.com/telugu-news/business/alarm-clock-app-will-get-your-out-bed-1328291

Leave Your Comment