logo

header-ad
header-ad

Facebook: 10 మిలియన్ల క్లబ్‌లోకి రౌడీ హీరో

రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇప్పటికే పాన్ఇండియా స్థాయిలో ఆయన పేరు వినబడుతోన్న విషయం తెలిసిందే. అలాగే బాలీవుడ్ హీరోయిన్లలో ఎవరిని కదిలించినా.. ఈ రౌడీ హీరో పేరే చెబుతున్నారంటే విజయ్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. రౌడీ బాయ్‌గా, యూత్‌లో మాంచి క్రేజ్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు మరొక మైల్ స్టోన్‌ను అధిగమించారు. సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో 1 కోటీ 25 లక్షల మంది ఫాలోయర్స్ పైగా సొంతం చేసుకుని సౌత్ ఇండియాలోనే నంబర్ 1 హీరోగా రికార్డ్ సృష్టించిన విజయ్, ఇప్పుడు ఫేస్‌బుక్‌లో కూడా కోటి (10 మిలియన్లు) మంది ఫాలోయర్స్‌ను సంపాదించి.. తన క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో మరోసారి తెలియజేశారు. విజయ్ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో ‘‘లైగర్’’ అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గానే పున:ప్రారంభమైన ఈ చిత్ర షూట్‌లోకి త్వరలోనే విజయ్ జాయిన్ కానున్నారు. కాగా, విజయ్ తన ఫేస్‌బుక్‌లో 10 మిలియన్ల క్లబ్‌లోకి చేరిన ట్యాగ్‌ని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

Source: https://chitrajyothy.com/telugunews/10-million-followers-to-vijay-deverakonda-in-facebook-chj-kbk-1921072007471428

Leave Your Comment